రజనీకాంత్ 2.ఓ వచ్చింది.. వెళ్ళింది. ఈ ఏడాది కాలా, 2.ఓ సినిమాలతో హడావిడి చేసిన రజనీకాంత్ వచ్చే ఏడాది మొదట్లోనే సంక్రాంతికి పెట్టా సినిమాతో వచ్చేస్తున్నాడు. యంగ్ హీరోలు కూడా ఏడాదికో, రెండేళ్లకో ఒక్క సినిమా చేస్తుంటే రజనీకాంత్ మాత్రం ఏడాదికి రెండు చొప్పున చేసుకుపోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా సినిమా చేసిన రజనీకాంత్ ఆ సినిమాలో త్రిష, సిమ్రాన్ లతో జోడి కడుతున్నాడు. ఈ సినిమా విడుదల కాగానే రజనీకాంత్ మరో మూవీ సెట్స్ మీదకి వెళ్లడానికి రెడీగా ఉంది. అది కూడా స్మార్ట్ అండ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో.
ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్
సర్కార్ చిత్రం తర్వాత మురుగదాస్ రజనీకాంత్ స్క్రిప్ట్ మీదే కూర్చుకున్నాడు. ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మురుగదాస్ ఇప్పుడు రజనీకాంత్ కోసం హీరోయిన్ ని కూడా చూశాడట. రజనీ సరసన ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ జోడి కడుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో రజనీకాంత్ సరసన ఏ సీనియర్ హీరోయిన్ నటిస్తుందో అని అందరూ అనుకున్నారు. కానీ, రజనీకి జోడిగా ఒక యంగ్ హీరోయిన్ నటిస్తుందని టాక్ బయటకు వచ్చింది. కీర్తి సురేష్ ను ఈ సినిమాకు ఎంపీ చేశారని అంటున్నారు. మరి ఆమె పేరు వినగానే రజనీ సరసన మరీ ఇంత యంగ్ హీరోయినా.? అని అనిపించక మానదు. సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ సరసన ఛాన్స్ దక్కడం కీర్తి సురేష్ అదృష్టమనే చెప్పాలి. మరోపక్క రజనీకాంత్ ఇలా చాలాకాలానికి ఒక యంగ్ హీరోయిన్ తో నటిస్తున్నాడని అనుకోవాలి.