మనోజ్ కి షాక్ ఇచ్చిన జగన్..?

సినిమాలు ఆపేసి ప్రజాసేవ చేద్దామని హైదరాబాద్ నుండి తిరుపతికి మకాం మార్చి అక్కడే సెటిల్ అయిపోయాడు మంచు మనోజ్. ప్రజాసేవ అని చెప్పాడు కానీ ఆయన అసలు [more]

Update: 2019-03-16 08:29 GMT

సినిమాలు ఆపేసి ప్రజాసేవ చేద్దామని హైదరాబాద్ నుండి తిరుపతికి మకాం మార్చి అక్కడే సెటిల్ అయిపోయాడు మంచు మనోజ్. ప్రజాసేవ అని చెప్పాడు కానీ ఆయన అసలు ఉద్దేశ్యం రాజకీయ ప్రవేశం. వైసీపీ తరపున ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని మనోజ్ ఆశ అంట. పొలిటికల్ ఇన్నింగ్స్ కోసమే తిరుపతి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ జగన్ అసలు మనోజ్ ని సీట్ ఇస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్.

టిక్కెట్ కష్టమే..!

ఇప్పుడున్న పరిస్థితిల్లో మనోజ్ కు టికెట్ ఇచ్చే అవకాశం లేదని టాక్. మనోజ్ ఎక్కడ నుండి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని వైసీపీ ఇంటర్నల్ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. మనోజ్ కి కచ్చితంగా టికెట్ దక్కుతుందనే ఆశతోనే లేటెస్ట్ గా మోహన్ బాబు కూడా రాజకీయ ప్రాధాన్యమున్న ఆరోపణలు చేసాడు. చంద్రబాబుని విమర్శిస్తూ వచ్చాడు. కానీ ఏం లాభం మనోజ్ కి టికెట్ దక్కే ఛాన్స్ లేదు. మరి మనోజ్ బ్యాక్ టూ హైదరాబాద్ అంటారా? చూడలి.

Tags:    

Similar News