ఇక రెచ్చిపోతుందిగా?

ఈ ఏడాది మహేష్ తో కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోయిన్ రష్మిక మాములు ఆనందంగా లేదు. మహేష్ లాంటి స్టార్ [more]

Update: 2020-02-22 08:01 GMT

ఈ ఏడాది మహేష్ తో కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోయిన్ రష్మిక మాములు ఆనందంగా లేదు. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో చెయ్యడం అంటే నమ్మలేకపోతున్నా అంటూ స్టేజ్ మీద ఫోజులు కొట్టింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో అవకాశం అంటే మాములుగా లేదు అమ్మడు వ్యవహారం అన్నారు. వరసగా స్టార్ హీరోస్ సినిమాలు రష్మిక ఇక సూపర్ అన్నారు. ఇక నితిన్ తో కలిసి నటించితిన్ భీష్మ తాజాగా విడుదల కావడం సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో రష్మిక గాల్లో తేలిపోతుంది. ఫస్ట్ టైం గ్లామర్ పాత్ర తో రష్మిక అదరగొట్టేసింది. అందంగానే కాదు.. నటన లోను రష్మిక సూపర్ అనిపించింది.

సినిమా హైలెట్స్ లో రష్మిక – నితిన్ కెమిస్ట్రీ ని తెగ పొగుడుతున్నారు. ఎక్సప్రెషన్స్ లో కానీ… నటనలో కానీ రష్మికాని ని ప్రత్యేకంగా అభిఅందిస్తున్నారు. రష్మిక మందన్న పాత్రకు ఫిట్ అనిపించింది. మరి సాంగ్స్ లోను రష్మిక అందాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అందంగా హాట్ గా రశ్మిక భీష్మ హిట్ లో భాగస్వామి అయ్యింది. మరి వరసగా సరిలేరు నీకెవ్వరూ భీష్మ హిట్స్ తో అమ్మడు ఎక్కడా ఆగేలా లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా మాత్రమే ఒప్పుకున్న రశ్మికకి ఇక వరస ఆఫర్స్ రావడం ఖాయం. ఇప్పటికే త్రివిక్రమ్ లాంటోళ్లని ఆఫర్స్ కోసం అడుగుతున్న రశ్మికకి త్వరలోనే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఛాన్స్ వచ్చినా రావొచ్చని టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News