డైరెక్టర్ – హీరో అనన్యకి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తారా?

లైగర్ మూవీ తో అనన్య పాండే ని పాన్ ఇండియా మూవీ తో సౌత్ కి పరిచయం చెయ్యబోతున్నాడు. లైగర్ లో అనన్య పాండే నటిస్తుంది దానితో [more]

;

Update: 2021-02-16 10:23 GMT
Ananya Pandey
  • whatsapp icon

లైగర్ మూవీ తో అనన్య పాండే ని పాన్ ఇండియా మూవీ తో సౌత్ కి పరిచయం చెయ్యబోతున్నాడు. లైగర్ లో అనన్య పాండే నటిస్తుంది దానితో సౌత్ చూపు అనన్య పైన పడింది. అనన్య పాండే లుక్స్ సౌత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అనన్య గురించి ఎంక్వైరీలు మొదలు పెట్టారు. గతంలో కొరటాల శివ ఆచార్య లోని రామ్ చరణ్ కోసం అనన్యని సంప్రదించినా అనన్య ఒప్పుకోలేదు. లైగర్ కంప్లీట్ అయ్యి విడుదలయ్యే వరకు మరో సౌత్ ఫిలిం ఒప్పుకునే ఉద్దేశ్యం లేదు అమ్మడుకి. అందుకని అనస్య ఆగుతుంది. కానీ సౌత్ నుండి అనన్య ని తమ సినిమాల్లో నటించమంటూ చాలానే ఆఫర్స్ వెళుతున్నాయి.

Ananya Pande

ఇక విజయ్ దేవరకొండ పక్కన నటించిన రష్మిక గీత గోవిందం తర్వాత బాగా బిజీ అవ్వడమే కాదు.. స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది. అటు పాన్ ఇండియా ఫిలిమ్స్, ఇటు బాలీవుడ్ ఫిలిమ్స్ అంటూ దున్నేస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ తో పెళ్లి చూపులు సినిమా చేసిన రీతూ వర్మ కూడా తెలుగులోనూ తమిళ్ లోను బాగా బిజీ అయ్యింది. ఇక అర్జున్ రెడ్డి షాలిని పాండే అయితే ఏకంగా బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. విజయ్ సరసన నటించిన హీరోయిన్స్ అందరూ సక్సెస్ ఫుల్ కెరీర్ నే ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో చేసిన హీరోయిన్స్ కి బ్రైట్ ఫ్యూచర్ దొరికింది. రెండు రకాలుగా చూసుకున్నా.. అటు డైరెక్టర్, ఇటు హీరో కలిసొచ్చే డైరెక్టర్, కలిసిచ్చే హీరో. అనన్యకి బ్రైట్ ఫ్యూచర్ అందిస్తారని ఆశిద్దాం. కొన్నాళ్లపాటు టాలీవుడ్ లో పాగా వేసేలాగే కనపడుతుంది అనన్య బేబీ.

Tags:    

Similar News