ప్రేమికుడి కోసం మారుతుందిలే!!

నయనతార టాప్ హీరోయిన్ అదికాదనలేని సత్యం కానీ.. నయనతార సినిమాల్లో తోపే.. కానీ అమ్మడుకి పొగరు చాలా ఎక్కువ. పొగరో, సెంటిమెంటో కానీ.. నయనతార సినిమాలో నటిస్తుంది [more]

Update: 2020-02-22 07:58 GMT

నయనతార టాప్ హీరోయిన్ అదికాదనలేని సత్యం కానీ.. నయనతార సినిమాల్లో తోపే.. కానీ అమ్మడుకి పొగరు చాలా ఎక్కువ. పొగరో, సెంటిమెంటో కానీ.. నయనతార సినిమాలో నటిస్తుంది కానీ.. ప్రమోషన్స్ కి రాదు. అయినా దర్శకనిర్మాతలు ఆమె వెంటే పడతారు. కానీ తర్వాత నయనతార మా సినిమా ప్రమోషన్స్ కి రావడం లేదంటూ లబో దిబో అంటారు. అయినా నయనతార స్పందించదు. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ అయినా నయనతార మాత్రం ప్రమోషన్స్ కి రాదు. ఎవరేమనుకున్నా నయనతార మాత్రం మారదు ఇది ఫిక్స్.

కానీ తాజాగా ప్రేమికుడు తనతో తియ్యబోయే సినిమా కోసమా మారుతుంది అంటున్నారు. నయనతార లవర్ విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నయనతార – సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సమంత మాత్రం సినిమా షూటింగ్ కి ఎంత పక్కనో.. ప్రమోషన్స్ కి కూడా అంతే పక్కా ఉంటుంది. కానీ నయనతార మాత్రం అలా కాదు. కానీ విగ్నేష్ సినిమా గనక నయనతార ఖచ్చితంగా ప్రమోషన్స్ కి వస్తుంది అంటున్నారు . విజయ్ సేతుపతి – నయనతార – సమంత కాంబోలో కాతువాకులారెండుకాదల్ సినిమాని విగ్నేష్ క్రేజీ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పాటికే నయనతార – సమంత వార్ టీజర్ తో సినిమా క్రేజ్ మరింత పెరిగింది. మరి ఈ సినిమా టాప్ లెవల్లో ఉండాలి అంటే నయనతార కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసేస్తుంది అంటున్నారు.

Tags:    

Similar News