సమంత ఫ్యామిలీ మ్యాన్ లుక్
సమంత పుట్టిన రోజు నాడు శాకుంతలం టీం నుండి ఆమెకి.. శాకుంతలం ఓపెనింగ్ లో కనిపించిన సమంత సారీ లుక్ పిక్ తో విషెస్ అందాయి. ఇక [more]
;
సమంత పుట్టిన రోజు నాడు శాకుంతలం టీం నుండి ఆమెకి.. శాకుంతలం ఓపెనింగ్ లో కనిపించిన సమంత సారీ లుక్ పిక్ తో విషెస్ అందాయి. ఇక [more]
సమంత పుట్టిన రోజు నాడు శాకుంతలం టీం నుండి ఆమెకి.. శాకుంతలం ఓపెనింగ్ లో కనిపించిన సమంత సారీ లుక్ పిక్ తో విషెస్ అందాయి. ఇక సమంత ఇప్పటివరకు మరో తెలుగు సినిమా సైన్ చేసింది లేదు. అందుకే సమంత కి టాలీవుడ్ నుండి విషెస్ అందాయి కానీ. స్పెషల్ గా సినిమాల నుండి లుక్స్ బయటికి రాలేదు. సమంత ఎప్పుడు క్యూట్ గా గ్లామర్ గా కనిపిస్తుంది. రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో డీ గ్లామర్ గా కనిపించినా.. అందులోనూ లంగా వోణీల్లో అందమైన గ్లామర్ చూపించింది సామ్.
అయితే ఇప్పుడు సమంత ఎంతో ఇష్టపడి చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ నుండి సమంత స్టిల్ రివీల్ చేసింది టీం. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో ఢీ గ్లామర్ గా టెర్రరిస్ట్ గా రాజి పాత్ర చేస్తుంది సమంత. అయితే ఇంతవరకు ఆ సీరీస్ లో సమంత ఎలా ఉంటుందో క్లారిటీ లేదు. నెగెటివ్ పాత్ర చేస్తుంది, టెర్రరిస్ట్ లా కనిపిస్తుంది అంటున్నారు తప్ప.. లుక్ రివీల్ చేసింది లేదు. అప్పుడెప్పుడో సామ్ బ్యాక్ లుక్ మాత్రం రివీల్ చేసారు. ఇప్పుడు వదిలిన సమంత లుక్ చూస్తే టెర్రరిస్ట్ గా నిజంగా షాకిచ్చేసింది. నిజమైన టెర్రరిస్టులా కనిపిస్తుంది సమంత. ఇక మనోజ్ బాజ్ పాయ్ దగ్గరనుండి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ టీం అంతా సమంతకి పుట్టిన రోజు విషెస్ తెలియజేసారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ మే నెలలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కినేని అభిమానులు మాత్రమేకాదు.. యావత్ ఇండియా ఆ వెబ్ సీరీస్ రాక కోసం ఎదురు చూస్తుంది.