గేమ్ ఓవర్ మూవీ రివ్యూ (2.75/5)

గేమ్ ఓవర్ మూవీ రివ్యూ న‌టీన‌టులు: తాప్సి, వినోదిని వైద్యనాథ‌న్‌, అనీష్ కురువిల్లా, సంచిత న‌ట‌రాజ‌న్‌, ర‌మ్య సుబ్రహ్మణ్యన్‌, పార్వతి త‌దిత‌రులు స‌ంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ [more]

;

Update: 2019-06-14 10:02 GMT

గేమ్ ఓవర్ మూవీ రివ్యూ

న‌టీన‌టులు: తాప్సి, వినోదిని వైద్యనాథ‌న్‌, అనీష్ కురువిల్లా, సంచిత న‌ట‌రాజ‌న్‌, ర‌మ్య సుబ్రహ్మణ్యన్‌, పార్వతి త‌దిత‌రులు
స‌ంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్
సినిమాటోగ్రఫీ : ఎ.వసంత్
నిర్మాత: ఎస్.శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్

తెలుగులో నటించినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేని హీరోయిన్ తాప్సి బాలీవుడ్ లో మాత్రం క్లిక్ అయింది. తెలుగులో గ్లామర్ పాత్రలు చేసినా రాని క్రేజ్ బాలీవుడ్ లో డీసెంట్ గా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పించింది. బాలీవుడ్ లో సక్సెస్ అయ్యాక తెలుగులో ఆనందోబ్రహ్మ సినిమాతో హిట్ అందుకున్న తాప్సి అటు బాలీవుడ్ లోను ఇటు సౌత్ లోను అందిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. తాజాగా తెలుగు తమిళ భాషల్లో తాప్సి గేమ్ ఓవర్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించింది. కథలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో, సినిమా కథ మొత్తం తాప్సి చుట్టూనే ఉండే సినిమాలో తాప్సి చేసింది. పింక్, సూర్మా, ముల్క్, బేబీ, నామ్ షబానా, బద్లా వంటి చిత్రాలతో వందకోట్ల హీరోయిన్‌గా మారిన తాప్సి ఇప్పుడు సౌత్ లో చేసిన గేమ్ యువర్ తో ఎలాంటి హిట్ అందుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఒక ముఠా చేతిలో అమృత (సంచన నటరాజన్‌) దారుణంగా హత్యగావించబడుతుంది. ఆమెకు శరీరంనిండా టాటూలు వేయించుకోవడం హాబీ. స్వప్న (తాప్సీ పన్ను) వీడియో గేమ్ డిజైనర్‌గా ఉంటూ గేమ్ ఓవర్ అనే వీడియో గేమ్‌కి అడిక్ట్ అవుతుంది. ఆమెకు డార్క్ ఫోబియో ఉంటుంది. చీకట్లో రెండు క్షణాలు కూడా ఉండలేదు. ఆమెకి గేమ్స్ ఆడ‌టమన్నా ఇష్టమే. వీడియో గేమ్స్‌కి బానిసగా మారిన స్వప్న తన చేతిపై వీడియో గేమ్ సింబల్‌ని టాటూగా వేయించుకుంటుంది. అనుకోకుండా ఆమె జీవితంలో ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంటుంది. అప్పట్నుంచి చీకటంటే భ‌యప‌డుతుంటుంది. త‌ల్లిదండ్రుల‌కి దూరంగా, ప‌ని మనిషి క‌ళ‌మ్మ (వినోదిని వైద్యనాథ‌న్‌)తో క‌లిసి ఒక ఇంట్లో నివసిస్తుంటుంది. స్వప్న త‌న చేతికి ఒక ప‌చ్చబొట్టు వేయించుకుంటుంది. ఆ ప‌చ్చబొట్టు రంగులో అమృత (సంచిత న‌ట‌రాజ‌న్‌) అస్తిక‌లు కూడా క‌లుస్తాయి. ఆ ప‌చ్చబొట్టు స్వప్నపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇంత‌కీ అమృత ఎవ‌రు? ఆమె ఎలా చ‌నిపోయింది? అమృత త‌ర‌హాలోనే స్వప్నకి కొన్ని సంఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.నటీనటుల నటన:
తాప్సి.. స్వప్నపాత్రలో అతికిపోయింది. ఆ పాత్రలో ఆమెను తప్ప వేరే వాళ్లను ఊహించుకోవడం కష్టం అన్నంతగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది తాప్సీ. సినిమాలో 60 శాతానికి పైగా వీల్ చైర్‌కే పరిమితమైనా పెర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. కథను మొత్తం తన భుజాలపై మోసింది. ఒక యాక్టర్‌కు ఇది నిజంగా పరీక్ష లాంటిదే. సినిమా ప్రారంభం నుండి 95 శాతం స్క్రీన్‌పై తాప్సీనే కనబడుతుంది. ప్రతి సీన్ తాప్సీ ఉంటుంది. ఆమె పెర్ఫామెన్స్‌తో రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తూ ఎమోషన్స్, యాక్షన్ సీన్లతో థ్రిల్ చేసింది. లుక్స్ పరంగా తాప్సీ చాలా క్యూట్‌గా కనిపించింది. మాలా పార్వతి, తాప్సీ కాంబినేషన్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి. పని మనిషి పాత్రలో వినోదిని వైద్యనాథ‌న్ చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. అమృత అనే అమ్మాయిగా సంచిత కనిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే అయినా.. ఆమె కూడా ఆక‌ట్టుకుంటుంది.విశ్లేషణ:
సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కిన చాలా కథలు ప్రేక్షకులను మెప్పించేవిగా ఉంటాయి. అయితే ఈ గేమ్ ఓవర్ కథను దర్శకుడు ఒక ఆత్మ క‌థ‌తో పాటు… సీరియ‌ల్ కిల్లర్స్ నేప‌థ్యాన్ని, మానసిక ప‌ర‌మైన సంఘ‌ట‌న‌ల్ని ఇందులో స్పృశించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. క‌థ మొద‌ల‌వ‌గానే ప్రేక్షకుడిని స్వప్న ప్రపంచంలోకి తీసుకెళ‌తాడు ద‌ర్శకుడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఎమోషన్స్ సీన్లను రాసుకున్నారు. చిన్న స్టోరీ లైన్‌కి క్రైమ్, హారర్, థ్రిల్లర్‌ కాంబినేషన్ సీన్లు బలాన్నిచ్చాయి. ఇక సినిమా మొత్తాన్ని ఒకే ఇంటిలో తీయడం దర్శకుడి టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ సినిమాలో కీల‌క‌మైన మ‌లుపుల వెన‌క సంఘ‌ట‌న‌ల్ని ముందుగానే బ‌య‌టపెట్టాడు ద‌ర్శకుడు. అయినా చివ‌రివ‌ర‌కు ఉత్కంఠని రేకెత్తిస్తూ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. అసలు ఆ సైకో కిల్లర్లు ఎవ‌రు? ఎందుకు చంపుతున్నాడనే విష‌యాన్ని కూడా ఇందులో ప్రస్తావించ‌లేదు. దాంతో క‌థ అసంపూర్ణంగా అనిపిస్తుంది. ట్విస్ట్‌లతో ప్రేక్షకుడు క్లైమాక్స్‌ని ఓ రేంజ్‌లో ఊహించుకుంటారు. అయితే క్లైమాక్స్ చాలా సింపుల్‌గా తేల్చేశారు. ఇక తాప్సీ ఎలా మోసపోయింది… ఆమెకు డార్క్ ఫోబియో రావడానికి కారణం ఏంటి…లాంటి విషయాలను టచ్ చేసిన టచ్ చేసిన దర్శకుడు వాటికి సరైన ముగింపు ఇవ్వలేదు. థ్రిల్లర్ సినిమాలు ఇష్టప‌డే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుతుండై ని చెప్పడంలో సందేహమే లేదు.

ఇక ఈ సినిమాకి రోన్ ఏతాన్ యోహాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ బలాన్ని ఇచ్చింది. నేపధ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచారు. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ ఎస్సెట్ సినిమాటోగ్రఫీ. ఒకే ఇంటిలో సినిమా మొత్తాన్ని చూపించినా ప్రేక్షకులకు ఫ్రెష్ లుక్‌తో షాట్స్ చూపించాడు. వసంత్ హారర్ సినిమా రేంజ్‌లో కొన్ని చోట్ల తన కెమెరా పనితనంతో భయపెట్టాడు. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ ప్లస్ పాయింట్ ఎడిటింగ్. 1.43 గంటల నిడివితో అక్కర్లేని సీన్లకు కత్తెర వేసి పర్ఫెక్ట్ ఎడిటర్ అనిపించుకున్నాడు. నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: కథ, కథనం, తాప్సి నటన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News