గుంజన్ సక్సేనా ఓటిటి రివ్యూ
గుంజన్ సక్సేనా ఓటిటి రివ్యూబ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్నటీనటులు : జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగడ్ బేడీ, వినీత్ కుమార్ సింగ్, మానవ విజ్ [more]
గుంజన్ సక్సేనా ఓటిటి రివ్యూబ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్నటీనటులు : జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగడ్ బేడీ, వినీత్ కుమార్ సింగ్, మానవ విజ్ [more]
గుంజన్ సక్సేనా ఓటిటి రివ్యూ
బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్
నటీనటులు : జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగడ్ బేడీ, వినీత్ కుమార్ సింగ్, మానవ విజ్ తదితరులు
సంగీతం : జాన్ స్టీవర్ట్ ఏడురి
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
సినిమాటోగ్రఫీ : ఆర్. ఢీ
నిర్మాత : కరణ్ జోహార్
దర్శకుడు : శరణ్ శర్మ
రేటింగ్:2.75/5
ఒకప్పటి టాప్ హీరోయిన్ శ్రీదేవి కూతురు, అలాగే దర్శకనిర్మాత బోని కపూర్ కి కూతురు అయినా జాన్వీ కపూర్ కెరీర్ తొలినాళ్లలోనే తన సినిమాని కరోనా లాక్ డౌన్ వలన ఓటిటిలో విడుదల చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ధఢక్ సినిమాతో వెండితేరకు పరిచయమైనా జాన్వీ కపూర్.. తన రెండో సినిమాని ఓ కొత్త దర్శకుడితో చేసింది. గుంజన్ సక్సేనా ద కార్గిల్ గర్ల్ అంటూ టైటిల్ పాత్ర పోషించిన జాన్వీ చిత్రం నెట్ ఫ్లిక్స్ నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గుంజన్ సక్సేనా అనే ఓ దేశభక్తురాలి బయోపిక్ లో జాన్వీ నటించింది. కార్గిల్ గర్ల్ గా పేరు పొందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తోలి లేడి పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ గుంజన్ సక్సేనా సినిమా లో జాన్వీ నటన ఎలా ఉంది? తోలి సినిమానే ఓ బయో పిక్ ఎంచుకున్న శరణ్ శర్మ మేకింగ్ స్కిల్స్ ఎలా వున్నాయి? ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర మెప్పించింది అనేది సమీక్షలో చూసేద్దాం.
కథ:
గుంజన్ సక్సేనా (జాన్వీ కపూర్) చాలా తెలివిగల అమ్మాయి. చిన్నతనంలోనే విమానం నడిపే పైలెట్ ని చూసి తాను కూడా పైలెట్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. కానీ తన ఇంట్లోనే అన్నయ్య, అమ్మ గుంజన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. కానీ గుంజన్ సక్సేనా తండ్రి అనూప్ సక్సేనా (పంకజ్ త్రిపాఠి) మాత్రం కూతురు పైలట్ గా ఎదిగేందుకు ప్రోత్సహించే వాడు. తన తండ్రి ప్రోత్సాహం ఉన్నా అందుకు సరిపడా డబ్బు ఉండదు. అయితే తన తండ్రి వైమానిక దళం లో చేరమని సలహా ఇస్తారు. గుంజన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. భారతీయ పైలట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అయితే ఆమె శిక్షణ శిబిరంలో ఆమె తప్ప అందరూ అబ్బాయిలే ఉంటారు. అక్కడ అడుగడుగునా గుంజన్ లింగ వివక్ష ఎదుర్కొంటుంది. అన్నిటిని తట్టుకుని నిలబడిన గుంజన్ మంచి పైలెట్ గా ఎదుగుతుంది. లింగ విక్షని గుంజన్ ఎలా ఎదుర్కొంది? దేశం కోసం కార్గిల్ యుద్దం లో గుంజన్ ఎలా పోరాడింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
జాన్వీ కపూర్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది చాలా కష్టమైనది మరియు ఉత్తమ మైనది అని చెప్పాలి. కెరీర్ తొలినాళ్లలోనే ఓ బయోపిక్ అవకాశం రావడం నిజంగా జాన్వీ కపూర్ అదృష్టమే. తండ్రి కూతుళ్ళ ఎమోషనల్ సన్నివేశాల్లో జాన్వీ నటన సూపర్బ్ అని చెప్పాలి. ఫేస్ లోని ఎక్సప్రెషన్స్ లోను జాన్వీ చక్కటి నటనను ప్రదర్శించింది. ఇక ఈ సినిమాని అన్నిటికన్నా మెయిన్ హైలెట్ గుంజన్ తండ్రి పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి. పంకజ్ త్రిపాఠి ఈ సినిమాకి గుండె లాంటి వాడు అని చెప్పాలి. పంకజ్ డైలాగ్ డెలివరీ, అతని ఎక్సప్రెషన్స్ అన్ని సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయి. పంకజ్ పాత్ర ఏదో డ్రామా లాగా కాకుండా, చాలా అద్భుతంగా నాచురల్ గా అనిపిస్తుంది. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.
విశ్లేషణ:
శరణ్ శర్మ తన మొదటి సినిమానే ఓ బయోపిక్ ని ఎంచుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి. కొత్త దర్శకుడు అయినప్పటికీ… ఈ దేశభక్తి అమ్మాయి గుంజన్ సక్సేనా బయోపిక్ ని అద్భుతంగా తెరకేక్కిన్చాడు. ఒక బయో పిక్ కి కావాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అయితే బయోపిక్ కావడం చేత ఫిక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. గుంజన్ సక్సేనా పైలట్ అయ్యేందుకు మాత్రమే వైమానిక దళానికి వచ్చింది అని… దేశం కోసం కాదు అని తెలిపే దృశ్యాలు చక్కగా చూపించారు. గుంజన్ పైలెట్ అవ్వాలి అనుకున్నప్పటినుండి.. ఆమె ఎదుర్కున్న ప్రతి సమ్యను దర్శకుడు చాల చక్కగా చూపించాడు. అప్పట్లో లింగ వివక్ష ఎలా ఉండేదో గుంజన్ సక్సేనా ఎదుర్కున్న వివక్షని చూస్తే తెలిసిపోతుంది. అలాగే తండ్రి – కూతుళ్ళ అనుబంధాన్ని, అలాగే వాల్ మధ్యన ఉన్న భావోద్వేగాలను దర్శకుడు చక్కగా హ్యాండిల్ చేసాడు. యుద్ధ సన్నివేశాలు మంచిది శక్తిని కలిగించాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం గుంజన్ పైలెట్ అవడానికి కష్టాలు చూపిస్తే.. సెకండ్ హాఫ్ లో ఆమె పైలెట్ అయ్యాక ఎదుర్కున్న సవాళ్ళని చూపించారు. సినిమాలో నాటకీయతకు తావివ్వకుండా.. అనవసర సన్నివేశాలను చూపించకుండా వాస్తవికతకు పెద్ద పీట వేశారు.
సినిమాలో జాన్వీ నటన, పంకజ్ త్రిపాఠి నటన హైలెట్ అనేలా ఉన్నాయి. కథ, ఎమోషనల్ సన్నివేశాలు ప్లస్ పాయింట్ అయ్యేలా ఉన్నాయి. ఇక సంగీతం సినిమాకి మైనస్ అనే చెప్పాలి. అలాగే వి ఎఫ్ ఎక్స్ ఎక్కువగా వాడటం చేత సన్నివేశాలు అన్ని కూడా చాలా నేచురల్ గా కనిపిస్తాయి. ఈ చిత్రం లో కెమెరా మరియు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా సినిమాలోని డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.