ఖైదీ మూవీ రివ్యూ

నటీనటులు: కార్తీ, నరైన్, రమణ, దీనా, యోగి బాబు, మహానది శంకర్ తదితరులు సంగీతం: శ్యామ్ సీఎస్ సినిమాటోగ్రఫర్: సత్యన్ సూర్యన్ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ నిర్మాత‌లు: [more]

Update: 2019-10-25 12:27 GMT

నటీనటులు: కార్తీ, నరైన్, రమణ, దీనా, యోగి బాబు, మహానది శంకర్ తదితరులు

సంగీతం: శ్యామ్ సీఎస్

సినిమాటోగ్రఫర్: సత్యన్ సూర్యన్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

నిర్మాత‌లు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, తిరుప్పూర్ వివేక్

దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ… తనకు తానుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. తమిళనాట కార్తీ స్టార్ హీరో రేంజ్ కి దగ్గరవుతుండగా.. తెలుగులోనూ మంచి పేరుతెచ్చుకున్నాడు. డిఫ్రెంట్ కథలతో ఎప్పుడూ కొత్తగా ఆలోచించే కార్తీ ఈసారి సాహసం చేసి ‘ఖైదీ’ అనే సినిమా చేశాడు. ‘ఖాకి, చినబాబు’ సినిమాల్తో హిట్ కొట్టేసిన కార్తీ ‘దేవ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ.. ‘ఖైదీ’ అనే డిఫ్రెంట్ కాదు కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక పాట లేకుండా, హీరోయిన్ తో హీరో చిందులు వెయ్యకుండా, హీరోయిన్ తో రొమాంటిక్ యాంగిల్ లేకుండా సస్పెన్స్ థ్రిల్లింగ్ కథతో తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమాని ప్రేక్షకులు ఏమేర రిసీవ్ చేసుకుంటారో అనే భయం కార్తిలో ఉంది. అదే విషయాన్ని కార్తీ మీడియాతోనూ పంచుకున్నాడు. సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కార్తీ ఖైదీ తో ఎలాంటి హిట్ అందుకున్నాడా? తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీ ఖైదీ తో ప్రేక్షకులను మెప్పించాడో? లేదో? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

జీవిత ఖైదు చేయబడిన ఢిల్లీ (కార్తీ) అనే ఖైదీ తన జీవితంలో మొదటిసారి తన కూతురుని చూడటానికి పదేళ్ల నిరీక్షణ తర్వాత ఎంతో ఆశతో జైలు నుంచి బయల్దేరతాడు. అదే రోజు రాత్రి దురదృష్టవశాత్తు పోలీసులు మరియు ఒక డ్రగ్ మాఫియా మధ్య జరుగుతున్న పోరులో ఢిల్లీ కూడా తెలియకుండానే ఇరుక్కుంటాడు. అనుకోకుండా అతనికి పోలీసుల ప్రాణాలనే కాపాడాల్సిన పరిస్థితి వస్తోంది. దానికి మొదట్లో అతను అంగీకరించకపోయినా చివరికి కూతురు భవిష్యత్తు కోసం ఆ పనికి పూనుకుంటాడు. మరి చివరికి తన కూతుర్ని ఢిల్లీ కలుసుకున్నాడా లేదా? పోలీస్ లను సేవ్ చేసే క్రమంలో ఎలాంటి సంఘటనలను అవరోధాలను అతను ఎదుర్కోవాల్సి వచ్చింది ? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:

ఢిల్లీ కేరెక్టర్ లో కార్తీ తన అద్భుతమైన నటనతో తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. కెరీర్ లో మొదటిసారి ఓ ఛాలెంజింగ్ రోల్ లో కార్తీ ఇరగదీసాడు. తన పాత్రకి ప్రాణం పోసిన కార్తి తను తప్ప ఆ పాత్ర ని ఎవరూ అంత బాగా చేయలేరు అన్నట్టుగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో, యాక్షన్ సన్నివేశాల్లో కార్తీ నటన సినిమాని నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. ఇక కార్తీ, ఖైదీ పాత్రలో అద్భుతంగా నటించాడు. కూతురు మీద ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశంలో అలాగే తన గతం వివరించే సీన్ లో మరియు కూతుర్ని కలుసుకునే సీన్ లో కార్తీ నటన ఎమోషనల్ గా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. నరైన్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. అలాగే దీనా నటన చాలా బాగుంది. రమణ, వత్సన్ చక్రవర్తి నటన పర్వాలేదు. యోగిబాబు కామెడీ సినిమాకి హైలైట్ గా చెప్పొచ్చు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

లోకేష్ కనగరాజ్ ఎంచుకున్న కథే.. ఖైదీ సినిమాకి మెయిన్ బలం. లోకేష్ కనగరాజ్ షార్ట్ అండ్ కనెక్ట్ అయ్యే లైన్ ను ఎంచుకొని దాన్ని సరైన దిశలో ఎస్టాబ్లిష్ చేశాడనే చెప్పాలి. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేవరకు ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. సినిమాలోని ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఇస్తూ, కథని ప్రేక్షకుల మనసుకి హత్తుకునే విధంగా చూపించారు లోకేష్ కనగరాజ్. మంచి స్టోరీతో, దర్శకుడు మంచి అటెంప్ట్ చేసినా కథలో పెద్ద స్పాన్ లేకపోవడంతో సినిమాలో ఎక్కువగా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను పెట్టే అవకాశం మిస్ అయింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో కంటెంట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే ఆ స్థాయిలో ఆకట్టుకోదు. సినిమా మొదలయినప్పటి నుంచి కూడా ఒక సీరియస్ నోట్ మీదనే కొనసాగుతుంది. కాకపోతే కామెడి మిస్సయ్యిందనుకున్న సమయంలో ఒక సందర్భోచిత ఫన్నీ ఎపిసోడ్ ను మాత్రం దర్శకుడు కథనానికి తగ్గట్టు సూపర్బ్ గా ప్రెసెంట్ చేశారు. సెకెండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ డ్రా బ్యాక్ ను చాల కవర్ చేసింది. అయితే సీరియస్ నెస్ కి తోడు కొన్ని ఎమోషన్స్ ను జోడించడం బాగా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ కార్తీ తన కూతురిని కలుసుకునే సన్నివేశం ఒకేటే ఒక్కటి ఉంటుంది కానీ అది కూడా ఎమోషన్ పరంగా చాలా బాగా వచ్చింది. కార్తీ లోని నటుడిని పూర్తిస్థాయిలో బయటకు తీసిన దర్శకుడు లోకేష్ అని చెప్పవచ్చు. నెరేషన్ పరంగా కూడా లోకేష్ కనగరాజ్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించాడు.

సాంకేతికంగా..

శ్యామ్ సీఎస్ అందించిన మ్యూజిక్ కథకు సరిగ్గా సెట్ అయ్యింది. హీరో తన కూతురు కోసం ఎంతగా పరితప్పిస్తున్నాడో అనేది శ్యామ్ తన నేపథ్య సంగీతంతో అంతే బాగా ఎలివేట్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశం లోని ప్రతి ఎమోషన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో యాక్షన్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఎడిటింగ్ కూడా బావుంది. నిర్మాణ విలువలు మాత్రం అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి.

 

రేటింగ్: 3.0/5

 

 

Tags:    

Similar News