నటీనటులు : నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు తదితరులు
మ్యూజిక్ : శ్రీచరణ్ పాకల
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ జె
దర్శకుడు : విజయ్ కనకమేడల
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
నాంది సినిమాతో అల్లరి నరేష్ పేరు ముందు అల్లరి పోయేలా చేసిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ హీరోగా వచ్చిన రెండో చిత్రం ఉగ్రం. మిర్న హీరోయిన్ గా నటించగా.. శ్రీచరణ్ పాకల సంగీతాన్ని అందించిన ఈ సినిమా మే 5న థియేటర్లలో విడుదలైంది. నరేష్ ఉగ్రరూపాన్ని విజయ్ చూపించాడా ? ప్రేక్షకులకు నచ్చిందా ? ఇప్పుడు చూద్దాం.
కథ
సీఐ శివకుమార్ (నరేష్) సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. ఐదేళ్ల దాంపత్యానికి గుర్తుగా కూతురు (ఊహారెడ్డి)తో హాయిగా సాగిపోతుంటుంది జీవితం. కానీ ఇంతలో ఓ యాక్సిడెంట్ శివ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మెమొరీ లాస్ తో.. కనిపించకుండా పోయిన తన భార్య అపర్ణ (మిర్నా), కూతురు కోసం వెతుకుతూ ఉంటాడు. శివకుమార్ భార్య, కూతురుతో పాటు సిటీలో వందలమంది ఆడపిల్లలు, మహిళలు మిస్ అవుతుంటారు. అసలు వీరందరిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారో తెలుసుకోవాలని సీఐ శివ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తనకు వచ్చిన అడ్డంకులను శివ ఎలా ఎదుర్కొన్నాడు ? తన భార్య, కూతుర్ని కనుగొన్నాడా ? ఈ కిడ్నాప్ ల వెనుక ఎవరున్నారు ? కిడ్నాప్ చేసినవారందరినీ ఏం చేస్తున్నారు ? అనేదే మిగతా కథ. అవన్నీ తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇటీవల కాలంలో మనచుట్టూ జరుగుతున్న సంఘటనలనే తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విజయ్ కనకమేడల. ప్రజలు మిస్ అయితే ధైర్యాన్నిచ్చే పోలీస్.. తన భార్య, పిల్లలే మిస్ అయితే ఏం చేస్తాడు ? తన ఫ్యామిలీతో పాటు మిస్ అయిన మిగతా వారిని ఎలా సేవ్ చేశాడు ? అనే కోణంలో తీసిన సినిమా ఉగ్రం. రోజూ చూసే వార్తల్లో కనిపించే సంఘటనలే అయినా.. ఈ కిడ్నాప్ లన్నీ ఎవరు ఎందుకు చేస్తున్నారనే కోణం ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. అల్లరి నరేష్ ఉత్తమ నటనను కనరిచాడనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్
+ హీరో నరేష్ నటన
+ యాక్షన్ సీన్లు
+ ప్రీ క్లైమాక్స్, ఎమోషనల్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
- లాజిక్ లేని సన్నివేశాలు
- బోర్ కొట్టించే ఫస్ట్ హాఫ్
- అవసరానికి మించిన సీన్లు
చివరిగా.. యాక్షన్ డ్రామా లవర్స్ ని ఉగ్రం ఆకట్టుకుంటుంది.