RamaBanam Review : రామబాణం దూసుకెళ్లిందా ? గురి తప్పిందా ?

రాజారామ్ తమ్ముడు విక్కీ (గోపీచంద్) రాత్రికి రాత్రే జీకే ఇంటిపై దాడిచేసి సుఖీభవ లైసెన్స్ ను తీసుకెళ్తాడు. నీతి, నిజాయితీనే

Update: 2023-05-05 09:29 GMT

ramabanam review and rating

సినిమా : రామబాణం

నటీనటులు : గోపీచంద్, డింపుల్ హయాతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు.
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిసామి
కథ : భూపతి రాజా
దర్శకుడు : శ్రీవాస్
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ)
శ్రీవాస్ , గోపీచంద్ - జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శ్రీవాస్ - గోపీచంద్ కలిసి లౌక్యంతో మరో హిట్ కొట్టారు. సూపర్ హిట్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి రామబాణంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఆది నుంచి కొన్ని అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను రామబాణం అందుకుందా ? ప్రేక్షకులకు నచ్చిందా ? శ్రీవాస్ వదిలిన రామబాణం దూసుకెళ్లిందా ? లేక గురితప్పిందా ? చూద్దాం.
కథలోకి వెళ్తే..
రాజారామ్ (జగపతిబాబు) తన ఊరిలో సుఖీభవ పేరుతో ఓ హోటల్ ను రన్ చేస్తాడు. ప్రజల ఆరోగ్యం బాగుండాలని భావించే ఆయన సంప్రదాయ వంటకాలను తయారు చేసి తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంచుతాడు. రాజారామ్ చేస్తున్న పనిఅదే బిజినెస్ లో ఉన్న కొందరికి నచ్చదు. దాంతో జీకే (తరుణ్ అరోరా), అతని మామ (నాజర్) సుఖీభవ హోటల్ పై దౌర్జన్యం చేసి లైసెన్స్ లాక్కెళ్లిపోతారు. రాజారామ్ తమ్ముడు విక్కీ (గోపీచంద్) రాత్రికి రాత్రే జీకే ఇంటిపై దాడిచేసి సుఖీభవ లైసెన్స్ ను తీసుకెళ్తాడు. నీతి, నిజాయితీనే నమ్మే రాజారామ్ కు విక్కీ చేసిన పని నచ్చదు. ఇలాచేస్తే జీవితంలో ఉన్నతంగా ఎదగలేమని హెచ్చరించి.. పోలీసులకు అప్పజెప్పేందుకు వెళ్తాడు. తాను ఎప్పటికైనా ఉన్నతంగా ఎదిగి తిరిగొస్తానని చెప్పి కలకత్తా వెళ్లిపోతాడు. 15 ఏళ్ల తర్వాత విక్కీ తిరిగి ఇంటికి వస్తాడు. అందుకు కారణం ఏంటి ? విక్కీ వచ్చాక ఏం జరిగింది? అనేది మిగతా కథ.
ఎలా ఉంది ?
ఈ రోజుల్లో కుటుంబ కథాచిత్రాలు తక్కువే. అందుకని దశాబ్దాల క్రితం చూసేసిన కథల్నే కాస్త కొత్తగా నేపథ్యాల్నిజోడించి తీసుకొస్తే.. ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చదు. సినిమాలో సేంద్రీయ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహారం అని కొత్త పాయింట్ చూపించారు కానీ.. కథ సాగిన విధానం పేలవంగా ఉంటుంది. ఒక్క సీన్ లో కూడా ప్రేక్షకుడికి కొత్తదనం కనిపించదు. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, డ్రామా అన్నీ ఉన్న కథే అయినా మనసుని హత్తుకునే ఎమోషన్స్, నవ్వించే కామెడీ లేకపోవడం బోర్ కొట్టిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+ పతాక సన్నివేశాలు
+ సంప్రదాయ ఆహార నేపథ్యం
మైనస్ పాయింట్స్
- కొత్తదనం లేని కథ
- ఆసక్తిగా సాగని సన్నివేశాలు
- ఆకట్టుకోని పాటలు
చివరిగా.. శ్రీవాస్ సంధించిన రామబాణం కాస్త గురితప్పింది.








Tags:    

Similar News