పుష్ప రివ్యూ.. బొమ్మ అదిరిపోయింది !
పుష్ప సినిమాపై రివ్యూ వచ్చేసింది. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు పుష్ప ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పుష్ప సినిమాతో ఊహించని మలుపు తిరగబోతోంది. అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ "పుష్ప- ది రైజ్" రేపే థియేటర్లలో విడుదలవ్వనుంది. ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ఈసినిమాపై అప్పుడే రివ్యూ వచ్చేసింది. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు పుష్ప ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ ట్వీట్ చేశారు. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని కితాబిచ్చారు.
బెస్ట్ సినిమాగా....
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఈ ఇయర్ టాలీవుడ్ బెస్ట్ సినిమాగా నిలుస్తుందని, బన్నీ కెరీర్ ను ఈ సినిమా మలుపు తిప్పబోతోందని జోస్యం చెప్పారు. ఊర మాస్ లుక్ లో బన్నీ లుక్స్ ఫ్యాన్స్ ను ఎక్కడికో తీసుకెళ్తాయన్నారు. అలాగే బన్నీ - రష్మికల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండిందన్నారు. సుకుమార్ దర్శకత్వం కూడా చాలా బాగుందని, సుక్కు డెరెక్షన్, బన్నీ యాక్షన్ ఈ సినిమాకు సూపర్ ప్లస్ పాయింట్స్ అని ఉమర్ సంధు చెప్పుకొచ్చారు. కాగా.. మొత్తం ఏడు భారతీయ భాషల్లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదలవ్వనుంది. పుష్ప సినిమాలో బన్నీ మునుపెన్నడూ లేని ఊరమాస్ లుక్ లో కనిపించనుండగా.. రష్మిక పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకోనుంది. అలాగే ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా పాటతో సమంత కుర్రకారుకు కిర్రెక్కించడం ఖాయమని తెలుస్తోంది.