తిమ్మరుసు మూవీ రివ్యూ

బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్, ఎస్‌.ఒరిజిన‌ల్స్‌న‌టీన‌టులు: సత్యదేవ్‌, ప్రియాంక జవాల్కర్‌‌, బ్రహ్మాజీ, అజయ్‌, అల్లరి రవిబాబు, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులుమ్యూజిక్ డైరెక్టర్: శ్రీచరణ్‌ పాకాలసినిమాటోగ్రాఫర్: [more]

Update: 2021-07-30 09:43 GMT

బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్, ఎస్‌.ఒరిజిన‌ల్స్‌
న‌టీన‌టులు: సత్యదేవ్‌, ప్రియాంక జవాల్కర్‌‌, బ్రహ్మాజీ, అజయ్‌, అల్లరి రవిబాబు, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రాఫర్: అప్పూ ప్రభాకర్‌
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి  
కరోనా లాక్ డౌన్, సెకండ్ వేవ్ ఉధృతితో మూడు నెలలు థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. వకీల్ సాబ్ తర్వాత బాక్సాఫీసు గలగలలు లేవు.. థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల సందడి లేదు. మధ్యమధ్యలో ఓటిటిల నుండి చిన్నా చితకా సినిమాలొచ్చినా.. ప్రేక్షకులవను తృప్తి పరిచిన సినిమాలు చాలా తక్కువే. నిన్నగాక మొన్న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నారప్ప తప్ప.. మిగతా సినిమాలేవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాయి. ఇక మూడు నెలల తర్వాత నేడు థియేటర్స్ దగ్గర సినిమాల సందడి మొదలైంది. ముందుగా యంగ్ హీరో సత్య దేవ్ తన తిమ్మరుసు సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాడు. భారీ ప్రమోషన్స్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తిమ్మరుసు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో సమీక్షలో చూసేద్దాం.  
కథ:
రామ‌చంద్ర అలియాస్ రామ్ (స‌త్య‌దేవ్‌) ఓ లాయర్. న్యాయాన్ని గెలిపించేడమే లక్ష్యంగా పనిచేస్తాడు. అర‌వింద్ అనే ఒక క్యాబ్ డ్రైవ‌ర్ హ‌త్య కేసులో ఎలాంటి నేరం చెయ్యని వాసు(అంకిత్‌) అనే కుర్రాడు శిక్షకి గురవుతాడు. ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించిన వాసు కేసుని రీ ఓపెన్ చేయిస్తాడు రామ్. ఈ కేసులో వాసు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు రామ్. ఆ కేసు ని సాల్వ్ చేసే క్రమంలో రామ్ కి ఎదురైన సంఘటనలు, సమస్యలు ఏమిటి? వాసు జైలు పాలు కావ‌డంలో పోలీస్ అధికారి భూప‌తిరాజు (అజ‌య్) ఏ పాత్ర ఏమిటి? అసలు ఆ క్యాబ్ డ్రైవ‌ర్ అర‌వింద్ హ‌త్య వెన‌క ఎవ‌రున్నారు? ఈ కేసుని రామ్ ఎలా సాల్వ్ చేసాడనేదే తిమ్మరుసు అసలు కథ.  
పెరఫార్మెన్స్:
యంగ్ లాయర్ పాత్రలో సత్యదేవ్ వన్ మ్యాన్ షోతో సినిమాని నడిపించాడు. మరీ ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో సత్యదేవ్ అదరగొట్టేసాడు. కొన్ని ఎమోషనల్ అండ్ సస్పెన్స్ సీక్వెన్స్ లో సత్యదేవ్ పెరఫార్మెన్స్ చాలా బావుంది. ఇక హీరోయిన్ గా ప్రియాంక జవల్కర్ కి అంత స్కోప్ లేని పాత్ర. సినిమాలో డ్యూయెట్స్ కి అవకాశం లేకపోవడంతో.. ఆమెకి నటించే స్కోప్ లేకుండా పోయింది. సత్యదేవ్ తర్వాత బ్రహ్మాజీ ఆకట్టుకున్నాడు. ఇక అజ‌య్ పోలీస్ ఆఫీసర్ గా ఒదిగిపోయాడు. అమాయ‌క కుర్రాడిగా అంకిత్ న‌ట‌న బాగుంది.  
విశ్లేషణ:
ఈ మధ్యన కోర్టు నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఒకటి. అలాగే అల్లరి నరేష్ నాంది సినిమా కూడా ఉంది. లాయర్ కథలతో సినిమాలు అంటే కోర్టు హాలులోనే ఎక్కువగా కథ నడుస్తుంది. కోర్టులో లాయర్ల మధ్యన వాదోపవాదనలు, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఉంటాయని ఫిక్స్ అవుతారు ప్రేక్షకులు. కాకపోతే కోర్టులో వాదించే వాదన కొత్తగా, ట్విస్ట్ లతో కూడుకున్నది గా ఉంటేనే.. ఇప్పటివరకు చూసిన సినిమాల నుండి ప్రేక్షకుడు కథను ఫ్రెష్ గా ఫీలవుతాడు. ఇప్పుడు దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి కూడా సత్య దేవ్ హీరోగా తిమ్మరుసు కథని కోర్టు హాల్ నేపథ్యంలోనే రాసుకున్నాడు. దర్శకుడు కథలోకి వెళ్ళడానికి బాగానే టైం తీసుకున్నాడు. అసలు లాయర్ అన్నవాడు ఒక కేసుని చేప‌ట్టాక దాని పూర్వప‌రాల‌న్నీ కూలంక‌షంగా తెలుసుకుని రంగంలోకి దిగుతాడు. కానీ ఈ సినిమాలో లాయర్ ప్ర‌తి ప‌ది నిమిషాల‌కి ఓ విష‌యం తెలుస్తుంటుంది. ఇది ముందే ఎందుకు చెప్ప‌లేదని బాధితుడిని అడుగుతుంటాడు. ఆ స‌న్నివేశాలు ఏమాత్రం ఆస‌క్తి లేకుండా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ నుంచి క‌థపై కాస్త ప‌ట్టు సాధించాడు ద‌ర్శ‌కుడు. సాక్ష్యాల్ని సేక‌రిస్తున్న‌ కొద్దీ, వాటిని హంతకుడు మాయం చేయ‌డం, అందులో వచ్చే ట్విస్ట్ లతో ప్రేక్షకుడిని క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ లో ఈ కేసుకీ, హీరో వ్య‌క్తిగ‌త జీవితానికీ ముడిపెట్టిన తీరు మ‌రింత‌గా మెప్పిస్తుంది. కాకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అయితే, దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా… చూపించడానికి ప్రయత్నించినా.. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినా ఫీలింగ్ వస్తుంది.  
సాంకేతికంగా..
ఈ సినిమాకి మెయిన్ హైలెట్ శ్రీచ‌ర‌ణ్ పాకాల నేప‌థ్య సంగీతం, అప్పు సినిమాటోగ్రఫీ. శ్రీచ‌ర‌ణ్ పాకాల అదిరిపోయే నేపధ్య సంగీతం కోర్టు సీన్స్ ని హైలెట్ చేసేలా ఉంది. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ప‌రిమిత వ్య‌యంతో నాణ్యత‌తో నిర్మించారు. 
రేటింగ్: 2.5/5

Tags:    

Similar News