మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

నటీనటులు: తరుణ్ భాస్కర్, అనసూయ, అభినవ్ గౌతమ్, పావని రెడ్డి, వాణి భోజనం, అవంతిక మిశ్రా తదితరులు సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవ ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ మ్యూజిక్: [more]

Update: 2019-11-01 08:12 GMT

నటీనటులు: తరుణ్ భాస్కర్, అనసూయ, అభినవ్ గౌతమ్, పావని రెడ్డి, వాణి భోజనం, అవంతిక మిశ్రా తదితరులు
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవ
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ
మ్యూజిక్: శివ కుమార్
నిర్మాత: విజయ్ దేవరకొండ
డైరెక్టర్: షమ్మిర్ సుల్తాన్

విజయ్ దేవరకొండ హీరో అంటే.. ఆ సినిమా క్రేజే వేరు. అంచనాలు ఆకాశం. అంతలాంటి క్రేజ్ ఉంది విజయ్ దేవరకొండకి. మరి విజయ్ దేవరకొండ హీరోగా కాకుండా నిర్మాతగా మారి సినిమాని తెరకెక్కిస్తే… సినిమాలో ఏదో ఉంది.. అందుకే అది విజయ్ దేవరకొండ కి నచ్చింది అని ప్రేక్షకులు భావించడమే కాదు… సినిమా పై ఆసక్తిని పెంచుకుంటారు. మరి ఇక్కడా అదే జరిగింది. తనని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని తన బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ సినిమాని నిర్మిస్తే.. ఆ సినిమాపై భారీ అంచనాలు వచ్చేస్తాయి. కథని నమ్మి షమ్మిర్ అనే దర్శకుడితో విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా సినిమాని తీసాడు. మీకు మాత్రమే చెప్తాలో తరుణ్ భాస్కర్ హీరోగా.. అనసూయ కీ రోల్ లో కనిపిస్తుంది అనేసరికి మంచి క్రేజ్ వచ్చింది. మెయిన్ విజయ్ దేవరకొండ నిర్మాత అనగానే సినిమా మీద డిస్ట్రిబ్యూటర్స్ కి నమ్మకం రావడంతో.. సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. మరి విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ అయ్యాడు. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
రాకేష్(తరుణ్ భాస్కర్) కామేష్(అభినవ్ భార్గవ్) స్నేహితులు. అయితే వీరిద్దరూ రేడియో జాకీలుగా పనిచేస్తుంటారు. తాము పనిచేసే ఛానల్ కి మంచి టీఆర్పీ రావడం కోసం రాకేష్, కామేశ్ లు చిత్ర విచిత్రమైన వీడియోస్ చేస్తుంటారు. అయితే రాకేష్.. డాక్టర్ స్టెఫీ (వాణి భోజన్)ని ప్రేమిస్తాడు. పెళ్లి కూడా కుదుర్చుకుంటాడు. పెళ్లికి ఒక్కరోజు ఉందనగా రాకేష్‌కు సంబంధించి మత్తు వదలరా.. నిద్దుర మత్తువదలరా అనే వీడియో బయటపడుతుంది. అప్పటికే ఆ వీడియో ని ఎవరో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేస్తారు. ఆ వీడియో కనుక స్టెఫీ చూస్తే పెళ్లాగిపోతుందని రాకేష్ భయపడతాడు. దీంతో దాన్ని ఎలాగైనా ఆన్‌లైన్‌లో ఆ వీడియో డిలీట్ చేయాలని స్నేహితుడు కామేష్ తో కలిసి పరుగు మొదలుపెడతాడు. మారా వీడియో ని స్టెఫీ చూసిందా? అసలు ఆ వీడియో ని స్నేహితులిద్దరు డిలీట్ చేశారా? చివరికి రాకేష్ కి స్టెఫీతో పెళ్లయిందా? అనేది తెర మీద మీకు మాత్రమే చెప్తా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:
ఈ సినిమాకు ఒక దర్శకుడు హీరో అనగానే అందరిలో కాస్త అనుమానం. దర్శకుడిగా పనిచేసిన వాడు హీరోగా మెప్పిస్తాడా అని. కానీ తరుణ్ డైరెక్టర్ గానే కాదు.. హీరోగా పక్కాగా సూట్ అయ్యాడు. ఈ సినిమాకి ప్రధాన బలం తరుణ్ భాస్కర్ అని చెప్పాలి. తరుణ్ మేనరిజం, కామెడీ టైమింగ్, పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. నటనలో అనుభవం లేని తరుణ్ భాస్కర్ నటన కొన్ని సన్నివేశాల్లో ప్రొఫెషనల్ యాక్టర్‌ను గుర్తుచేస్తుంది. తరుణ్‌కు సపోర్టింగ్ క్యారెక్టర్‌గా అభినవ్ గోమఠం పర్వాలేదనిపించారు. సంయుక్తగా యాంకర్ అనసూయది చిన్న పాత్రే. వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అవంతికా మిశ్రా తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

విశ్లేషణ:
విజయ్ దేవరకొండ నిర్మాతగా సినిమా వస్తుంది అంటే… ఆ సినిమాలో ఏదో కొత్తదనమ్ ఉండకపోదు అని అనుకుంటారు ప్రేక్షకులు. హీరోగా ఓ మార్క్ సెట్ చేసిన విజయ్ నిర్మాతగా కథల ఎంపికలో చాలా శ్రద్ద తీసుకునే సినిమా చేసాడనిపిస్తుంది. అయితే చాల చిన్న స్టోరీ లైన్ తో కథలోని సన్నివేశాలను అల్లుకున్నాడు దర్శకుడు షమ్మిర్. చిన్న కథ నుండే కామెడీ జొప్పించాడు. అయితే కామెడీ మాత్రం పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. అయితే కామెడీ బాగానే వర్కౌట్ అయినా స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.ఫస్టాఫ్‌ను కామెడీతో బాగానే నడిపించారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం కాంబినేషన్.. డైలాగులు బాగా కుదిరాయి. కానీ సెకండాఫ్‌కు వచ్చే సరికి సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. దీనికి తోడు అస్సలు పరిచయం లేని నటీనటులు ఎక్కువైపోవడం కూడా ఇబ్బంది పెట్టే అంశమే. కాకపోతే సినిమా నిడివి తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకుడు ఊహించనిదే. అయితే కంటెంట్ ఎంత గొప్పగా ఉన్నా సినిమా చూస్తున్న ప్రేక్షకుడు విసుగు చెందకూడదు. అప్పుడే ఆ సినిమా ఆడుతుంది. కానీ… ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడు కచ్చితంగా విసుగు చెందుతాడు.

సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా అంతగొప్పగా లేదు. మ్యూజిక్ సో సో గా అనిపిస్తుంది. కానీ శివకుమార్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అంత గొప్పగా ఏమీలేదు. నిర్మాణ విలువలు చెత్తగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ నిర్మాణ విలువలు పరిమితంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: కామెడీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, తరుణ్ భాస్కర్, అభినవ్ నటన
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, మ్యూజిక్

Tags:    

Similar News