వినయ విధేయ రామ షార్ట్ రివ్యూ

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వినయ విధేయరామ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత అర్ధరాత్రి నుండి యూఎస్ [more]

Update: 2019-01-11 02:58 GMT

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వినయ విధేయరామ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత అర్ధరాత్రి నుండి యూఎస్ ప్రీమియర్స్ తో వినయ విధేయరామ సందడి మొదలైంది. మెగా ఫాన్స్ తమ అభిమాన హీరో సినిమాని తిలకించడానికి చలి కూడా లెక్కచెయ్యకుండా థియేటర్స్ వద్ద బారులు తీరారు. ఇక రంగస్థలం హిట్ తర్వాత రామ్ చరణ్ ఈ మాస్ ఎంటర్టైనర్ లో నటించడంతో .. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ ఫ్యాన్స్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఓవర్సీస్ ప్రీమియర్ షో టాక్ ప్రకారం వినయ విధేయరామ టాక్ ఏమిటంటే…

నలుగురు అనాధ పిల్లలకు మరో అనాధగా ఒక చిన్నబాబు వాళ్ళకి దొరుకుతాడు. వారు ఐదుగురు ఒకే రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ముల్లా పెరుగుతారని… పెరిగి పెద్దయిన వారిలో ప్రశాంత్ అంటే రామ్ (రామ్ చరణ్) పెద్దన్నయ్య విలన్ వివేక్ ఒబెరాయ్ వలన ఇబ్బందుల్లో పడడం… ఆ తరవాత రామ్ తన అన్న ప్రశాంత్ కోసం విలన్ తో పోటీ పడడం ఆ తర్వాత ఛేజింగ్ లు, యాక్షన్ అంతా మాస్ ప్రేక్షకులను అలరించేదిలా వినయ విధేయరామ ఉందంటున్నారు. రంగస్థలంలో చిట్టిబాబు గా అదరగొట్టే నటనతో ఆకట్టుకున్న రామ్ చరణ్ వినయ విధేయరంలో యాక్షన్ హీరోగా అదరగొట్టేసాడంటున్నారు.

ఇక బోయపాటి యాక్షన్ ఓ రేంజ్ లో ఉందని.. రామ్ చరణ్ నటన అద్భుతమని.. ఇంటర్వెల్ బ్లాక్ కూడా సూపర్ గా ఉందని చెబుతున్నారు. ఇక కథలో బలం లేకపోవడం.. రొటీన్ రివెంజ్ డ్రామాగా కథ ఉండడం… సెకండ్ హాఫ్ ఆకట్టుకునేలా లేదని ఓవర్సీస్ ప్రేక్షకుల టాక్. అలాగే దేవిశ్రీ అందించిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయని… మిగతా పాటలు తేలిపోయాయంటున్నారు. మరి ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఇలా ఉంది అంటే.. ఇక్కడ తెలుగు రాష్ట్రాల టాక్ ఎలా వుందో మరికాసేపట్లో మీ కోసం.

Tags:    

Similar News