వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ

వైల్డ్ డాగ్ మూవీ రివ్యూబ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్నటీనటులు: నాగార్జున, దియా మీర్జా, షియామి ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులుమ్యూజిక్ డైరెక్టర్: థమన్ సినిమాటోగ్రఫీ: షనేల్ డియో ఎడిటింగ్: [more]

Update: 2021-04-02 08:58 GMT

వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్
నటీనటులు: నాగార్జున, దియా మీర్జా, షియామి ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: థమన్ 
సినిమాటోగ్రఫీ: షనేల్ డియో 
ఎడిటింగ్: శర్వన్ కత్తికనేని 
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 
దర్శకత్వం: అహిషోర్ సాల్మన్  
ఇన్వెస్టిగేషన్ కథలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోయినా.. దానిలోని ట్విస్ట్ లు కథనానికి బలం చేకూరుస్తాయి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తర్వాత ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ ని ప్రేక్షకుల్లో కలిగిస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందుకే నాగార్జున ఈసారి అలాంటి ఇవెస్టిగేషన్ ఎన్. ఐ.ఏ నేపథ్యం ఉన్న కథని ఎంచుకుని వైల్డ్ డాగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. మన్మధుడు 2, ఆఫీసర్ సినిమాలు డిజాస్టర్స్ అయినా.. నాగార్జున వైల్డ్ డాగ్ పట్ల ప్రేక్షకుల్లో ప్రమోషన్స్ తోనే ప్రత్యేక ఆసక్తిని కలిగించాడు. వైల్డ్ డాగ్ టీం తో కలిసి భారీ ప్రమోషన్స్ చేసారు. వైల్డ్ డాగ్ ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన నాగ్ అండ్ టీం.. సినిమాతో మరెంత ఉత్కంఠకి గురి చేసారో సమీక్షలో తెలుసుకుందాం.  
కథ:
ఏసిపి విజయ్ వర్మ(నాగార్జున) కి ఉగ్రవాదులని పట్టుకుని జైల్లో పెట్టడం కన్నా.. వాళ్ళని అంతం చెయ్యడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకే అతన్ని అందరూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. పూణెలో ఓ బేకరీలో ఓ బాంబ్ బ్లాస్ట్ జ‌రుగుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి ఎన్‌.ఐ.ఏ.. విజ‌య్ వ‌ర్మ ని నియ‌మిస్తుంది. ఆ కేసులో భాగంగా ఆ బాంబు బ్లాస్ట్ కి కారణం ఖాలీద్ అనే ఉగ్ర‌వాది అని తెలుసుకుంటాడు విజయ్ వర్మ. ఖాలీద్ ని పట్టుకోవడానికి విజయ్ వర్మ తన టీం తో కలిసి నేపాల్ కి వెళ్తాడు. విజయ్ వర్మ త‌న టీమ్ తో చేసిన ఆప‌రేష‌నే.. వైల్డ్ డాగ్‌. మరి ముంబై లో మిస్ అయిన ఖలీద్ నేపాల్ లో అయినా దొరికాడా? విజయ్ వర్మ అతని టీం ఆప‌రేష‌న్ ఫ‌లించిందా? ఖాలీద్ ని ప్రాణాల‌తో ఇండియా తీసుకురాగ‌లిగారా? అనేదే మిగిలిన క‌థ‌.
పెరఫార్మెన్స్:
నాగార్జున విజయ్ వర్మ గా సిన్సియ‌ర్ ఎఫర్ట్ పెట్టాడు. ఎన్.ఐ.ఏ అధికారిగా నాగార్జున లుక్స్ అక్కడక్కడా తేలిపోయాయి. ట్రైలర్ లో చూపించిన విధంగా నాగ్ సినిమాలో కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. కానీ ఫీట్లు త‌గ్గించేసి, ఆ ప‌నిని త‌న టీమ్ కి అప్ప‌గించేశాడు నాగ్. వైల్డ్ డాగ్ అని నాగ్ కి పేరు పెట్టినా.. వైల్డ్ డాగ్ మాదిరి నాగ్ కనిపించలేదు. ఇంకాస్త యాక్టీవ్ గా ఉండాల్సింది. హీరోయిన్ గా కనిపించిన దియా మీర్జా పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. స‌యామీఖేర్ మ‌రీ సీరియ‌స్‌గా ఏజెంట్ గా క‌నిపించింది. ఆ టీమ్ లో కాస్త గుర్తిండిపోయేది అలీ రాజా పాత్రే. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
ఎన్.ఐ.ఏ నేపథ్యంలో సాగే కథలకు భారీ ట్విస్ట్ లు అవసరం. ఆ ట్విస్ట్ లే కథలకి ప్రాణం. ఇక్కడ వైల్డ్ డాగ్ కోసం దర్శకుడు సాల్మన్ జరిగిన కథనే తీసుకున్నాడు. ఇండియా లో జరిగిన బాంబు బ్లాస్ట్ లు కి ప్రధాన సూత్రధారుడు యాసిన్ కోసం అనేకరకాల ఆపరేషన్లు, రకరకాల దర్యాప్తు సంస్థలు చేసిన ఇన్వెస్టిగేషన్స్ ఫలించి అతన్ని పట్టుకుని ఇండియా కి తీసుకురావడం అనే జరిగిన కథనే దర్శకుడు వైల్డ్ డాగ్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఉగ్ర‌వాద నేప‌థ్యంలో సాగే క‌థ‌లు, టెర్ర‌రిస్టుల అన్వేష‌ణ‌, దేశ‌భ‌క్తి క‌థ‌లు.. ఇవన్నీ మంచి క‌మ‌ర్షియ‌ల్ అంశాలే. కానీ అవే ఈ సినిమాలో కనిపించవు. బాంబు బ్లాస్ట్ కి కారకులైన ఉగ్రవాదిని వెతికి పట్టుకుని ఇండియాకి తీసుకురావడమే.. ఈ కథ సారాంశం. అయితే కథ పాతదే అయినా.. ఇన్వెటిగేషన్ అంశాలు కొత్తగా ఉంటే కథనం ఇంట్రెస్ట్ గా అనిపించేది. నిజానికి ఇన్వెస్టిగేష‌న్ ఇంకొంచెం థ్రిల్లింగ్ గా రాసుకోవాల్సింది. ఖాలీద్ ని ప‌ట్టుకోవ‌డానికి విజయ్ వర్మ చేసే ప్ర‌య‌త్నాలే ఈ సినిమాకి కీల‌కం. ముంబైలో స్కెచ్ వేసి ఖాలీద్ ని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించడం, ఖాలీద్ తెలివిగా అక్క‌డ్నుంచి త‌ప్పుకోవ‌డం ఆక‌ట్టుకుంటుంది. నిజానికి అక్క‌డే ఇంట్ర‌వెల్ కార్డ్ వేస్తే బాగుండేది. ఉగ్రవాది ఖాలిద్ ని పట్టుకునే ప్రాసెస్ లో వైల్డ్ డాగ్ రెండుసార్లు విఫలమవుతుంది. అలాగే కథ మొత్తం ప్రేక్షకుడు ఊహకి తగ్గట్టుగా సాగుతుంది. విజయ్ వర్మ కేరెక్టర్ లో బలం లేదు. ఆ ఉగ్రదాడుల బాధితుల్లో విజయ్ వర్మ కూడా ఉంటాడు. అయితే అతని కేరెక్టర్ కి ఎమోషనల్ అంశాలు జోడిస్తే బావుండేది. అవన్నీ చాలా సింపుల్ గా అనిపిస్తాయి తప్ప ఎక్కడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు స్క్రీన్  ప్లే ను మరింత పగడ్బందీగా రాసుకుని ఉంటే బాగుండును అనిపిస్తుంది. అలాగే ఇన్వెస్టిగేటింగ్ పాయింట్స్ కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. ఇందులో కొన్ని సన్నివేశాలు గతంలో ఏదో సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ప్రీ క్లైమాక్సే అని చెప్పాలి. టెర్రరిస్ట్ ఖలీద్ ను నేపాల్ బోర్డర్ క్రాస్ చేయించి.. ఇండియా తీసుకొచ్చే సన్నివేశం మెప్పిస్తుంది. ఆ సీన్ ప్రేక్షకులకి మంచి థ్రిల్ ఇస్తుంది. ఇక ఈ సినిమా చూస్తున్నంతసేపు  అక్కడక్కడా పాపులర్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గుర్తుకు వస్తుంది.  
సాంకేతికంగా:
ఈ సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అద్భుతం అనిపిస్తుంది. అలాగే.. సినిమాటో గ్రఫీ , నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. 

రేటింగ్: 2.25/5

Tags:    

Similar News