నటీనటులు: సుశాంత్, సోనమ్ ప్రీత్ బజ్వా
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
రేటింగ్: 1.5/5
కాళిదాసుతో హీరోగా సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైన అక్కినేని హీరో సుశాంత్. ఇక తర్వాత వచ్చిన ఆ తర్వాత వచ్చిన 'కరెంట్, అడ్డా' సినిమాలు చేసాడు. తానూ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కొత్త దర్శకులతోనే చేసాడు. కానీ అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. ఇకలాభం లేదనుకుని ఈ సరి సీనియర్ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో ఆటాడుకుందాం..రా టైటిల్‌తో సినిమా స్టార్ట్ చేశాడు. శ్రీనాగ్ కార్పొరేషన్ బేనర్లో వరసగా సుశాంత్‌తో నాలుగో సినిమా నిర్మించిన చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల కూడా ఈసారి కన్ఫర్మ్గా హిట్ సినిమా చేస్తున్నామనే కాన్ఫిడెన్స్‌తో వున్నారు. మరి ఈసారైనా హిట్ తో ప్రేక్షకుల చెంతకు రావాలనుకున్న సుశాంత్ ....ఆటాడుకుందాం రా తో ఎంతవరకు మెప్పించగలిగాడు. మరి జి.నాగేశ్వర రెడ్డి అయినా సుశాంత్ కి హిట్ ఖాతా తెరవగలిగాడా అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ: విజయ్ రామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్) అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వీరు వ్యాపారం లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒకొనొక సందర్భం లో వీరిద్దరి మధ్య అభిప్రాయం భేదాలు వస్తాయి. ఈ ప్రాణ స్నేహితులను దెబ్బకొట్టడానికి శాంతారాం అనే విలన్ కాచుకుని కూర్చుంటాడు. అయితే స్నేహితుల మధ్య వచ్చిన గొడవలు శాంతారాం తనకు అనుకూలం మార్చుకుంటాడు. అయితే శాంతారాం చేసిన తప్పు అనుకోకుండా ఆనంద్ ప్రసాద్ మీద పడుతుంది. ఈ కారణం గా ప్రాణ స్నేహితులుగా వున్న వారిద్దరూ విడిపోతారు. అయితే ఆనంద్ ప్రసాద్ ఏ తప్పు చెయ్యలేదని అదంతా అతని పై కావాలనే మోపబడిన నింద అని... దీనిని నిరూపించేందుకు ప్రసాద్ కొడుకు సుశాంత్ అమెరికా నుండి విజయ్ రామ్ మేనల్లుడిగా విజయ్ రామ్ ఇంట్లో సెటిల్ అవుతాడు. సుశాంత అంటే విజయ్ రామ్ కి అస్సలు ఇష్టం ఉండదు. మరి అలాంటి ఇంట్లో సుశాంత్ తన తండ్రి పై పడ్డ నిందను చెరిపెయ్యడానికి ఏ విధం గా ప్లాన్స్ వేసి అక్కడ ఉన్న వారిని ఏ విధం ఆడుకున్నాడు అనేది తెర పై చూడాల్సిందే. అసలు సుశాంత్ కి హీరోయిన్ సోనమ్ ప్రీత్ బజ్వా కి ఉన్న సంబంధం ఏమిటి అనేది కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పనితీరు: అసలు ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ నాగేశ్వరరెడ్డి. గతంలో అతని డైరెక్షన్లో వచ్చిన సినిమాలు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా కమర్షియల్ హిట్స్‌గా కూడా నిలిచాయి. అసలు ఈ సినిమాకి కథే పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇలాంటి కథ ఉన్న సినిమాలు అన్ని రకాల భాషల్లో ఇప్పటికే చాలాసార్లు వచ్చేసాయి. పోనీ ఇలాంటి కథను తీసుకున్న డైరెక్టర్ అసలు కామెడీపై దృష్టి పెట్టకుండా కథ నాథా చాల నీరసం గా నడిపించేసాడు. అసలు ఈ సినిమాని జి.నాగేశ్వరెడ్డి డైరెక్ట్ చేసిన సినిమానేనా అనుకుంటారు ఈ సినిమా చూసిన వారందరు. అసలు కొత్తదనం అంటూ ఈ సినిమాలో ఏది కనబడదు. ఇక హీరో గా సుశాంత్ ఈ సినిమాలో కొంచెం కొత్తగా కనిపిస్తాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడనే చెప్పాలి. అసలు ఈ సినిమా అన్ని రకాల సినిమాలు కలగలిపి తీసినట్టున్నారు. అందుకే సినిమా మొదలైన దగ్గర నుండి ఎండ్ వరకు సినిమా ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు ఇంటికి పోదామా అని ప్రేక్షకుడు ఫీల్ అవ్వని సందర్భం ఉండదు. ఇక కథ పరిస్థితే అలా ఉంటే పాటలు ఇంకా నీరసాన్ని తెప్పిస్తాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చాలా సాదా సీదాగా వుంది. హీరోయిన్ సోనమ్ బజ్వా ఫేస్‌ని చూడడం ఆడియన్స్‌కి పేద పరీక్షే. దాశరథి శివేంద్ర ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించాడు. అలాగే నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి మనకు స్క్రీన్ మీద కనిపించేలా చెయ్యడంలో అతను సక్సెస్ అయ్యాడు. గౌతంరాజు ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. సెకండాఫ్‌లో బ్రహ్మానందం కోసం వేసిన టైమ్ మెషీన్ సెట్లో అతనితో చేయించిన కామెడీ ఏమాత్రం పండలేదు. ఈమధ్యకాలంలో బ్రహ్మానందం చేసే కామెడీని ఎంజాయ్ చెయ్యలేకపోతున్న ప్రేక్షకులకు టైమ్ మెషీన్ కామెడీ మరింత విసుగును పుట్టించింది. కథలో కొత్తదనం లేదు, కథనంలో నావెల్టీ లేదు. కామెడీ అయినా బాగుందా అంటే అదీ లేదు. నాగేశ్వరరెడ్డి సినిమా అంటే ఎంతో కొంత కామెడీ వుంటుందన్న ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని అతను రీచ్ అవ్వలేకపోయాడు. కొత్త దర్శకులకు ఏమి తెలియక సినిమాలు ప్లాప్ అయ్యాయని సుశాంత్ ఈసారి పెద్ద దర్శకుడికి అవకాశం ఇస్తే పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రాలేదు. పాపం సుశాంత్ ఇంకా హీరో అనిపించుకోవడాని ఇంకెన్ని సినిమాలు చెయ్యాలో మరి.
ప్లస్ పాయింట్స్: సుశాంత్, పృద్వి కామెడీ కొంతవరకు ప్లస్, నాగ చైతన్య ఎంట్రీ
మైనస్ పాయింట్స్: కథ, కథనం, డైరెక్టర్, మ్యూజిక్ ఇంకా చాలానే వున్నాయి ఈ సినిమాకి మైనస్ పాయింట్స్