పుష్ప ఎఫెక్ట్.. ఆన్సర్ పేపర్లో జవాబు రాసేదే లే అంటూ..
ఇటీవలే పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం పేపర్లు దిద్దే ప్రక్రియ జరుగుతోంది. పేపర్లు దిద్దుతున్న ఓ ఉపాధ్యాయుడు ..
పశ్చిమ బెంగాల్ : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎఫెక్ట్ ఇప్పటికీ కనిపిస్తోంది. చాలా మంది సరదాగా సినిమాలోని తగ్గేదే లే డైలాగును వాడుతుండగా.. ఓ విద్యార్థి అదే డైలాగ్ ను ఎగ్జామ్ ఆన్సర్ పేపర్లో రాయడం ఇప్పడు చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ఇటీవలే పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం పేపర్లు దిద్దే ప్రక్రియ జరుగుతోంది. పేపర్లు దిద్దుతున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి రాసిన డైలాగ్ చూసి షాకయ్యారు. 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే' అని ఆ విద్యార్థి జవాబు పత్రంలో రాయడంతో.. దానిని ఉపాధ్యాయుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదువుపై ఆసక్తిలేని వారు ఇటువంటి డైలాగులు రాస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ నినాదమైన 'ఖేలా హోబే' (ఆట ముందుంది) అనే నినాదాన్ని కూడా కొందరు విద్యార్థులు జవాబు పత్రాల్లో రాసిన విషయం తెలిసిందే.