Delhi : ఢిల్లీ ఆప్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏడాది వరకూ నిషేధం

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-20 01:41 GMT

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఏడాది పాటు ఢిల్లీ పరిధిలో బాణ సంచా కాల్చకూడదని నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 1986 చట్టం ప్రకారం బాణాసంచా పేల్చడంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బాణసంచా కాల్చడంపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వచ్చే జనవరి 1వ తేదీ వరకూ...
బాణసంచా తయారీ, నిల్వలు, విక్రయాలు, ఆన్ లైన్ లో డెలివరీలతో పాటు వాటిని వినియోగించడంపై కూడకా నిషేధాన్ని ఢిల్లీ సర్కార్ విధించింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకూ ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉండనున్నాయి. ఇటీవల దీపావళి పండగ తర్వాత ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగడంతో ప్రజలు అస్వస్థలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆప్ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News