లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా.. రెండ్రోజులు త్రివర్ణం అవనతం

గానకోకిల లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా రెండ్రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. దేశవ్యాప్తంగా నేడు, రేపు

Update: 2022-02-06 08:25 GMT

గానకోకిల లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా రెండ్రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. దేశవ్యాప్తంగా నేడు, రేపు త్రివర్ణ పతాకాన్ని సగం ఎత్తులోనే ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే ఆది, సోమ వారాలను సంతాప దినాలుగా ప్రకటించింది. కరోనా సోకి జనవరి 8న ఆసుపత్రిలో చేరిన భారతరత్న లతా మంగేష్కర్.. ఇవాళ ఉదయం 8.12 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

కరోనా నుంచి కోలుకున్నా.. న్యూమెనియాతో ఆమె వెంటిలేటర్ పైనే చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజులకే వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యులు తెలిపారు.. కానీ ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించడంతో వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామని నిన్న పేర్కొన్నారు. కరోనా తగ్గినా.. దాని వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలతో లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచినట్లు బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి సీఈఓ ఎన్ సంతానం తెలిపారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.




Tags:    

Similar News