ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

లోయలో పడ్డ బస్సు.. ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

Update: 2022-06-06 04:01 GMT

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా నుండి ఇద్దరు సిబ్బంది, 28 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో 150 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో 25 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగంతో పాటు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లో పాల్గొన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) అధికారుల ప్రకారం, 25 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు గాయపడిన వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు ఉత్తరకాశీలోని యమునోత్రి ధామ్‌కు వెళుతున్నారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామీతో మాట్లాడానని వెల్లడించారు.

"ఆదివారం సాయంత్రం, పురోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్టా నుండి 4 కి.మీల దూరంలో ఒక టూరిస్ట్ బస్సు లోయలో పడిపోయిందని మాకు సమాచారం అందింది. బస్సులో 28-30 మంది ప్రయాణికులు ఉన్నారని, 150 మీటర్ల లోతైన లోయలో పడిపోయిందని సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఉజెలి, మోరి, చక్రత, సహస్త్రధార పోస్ట్‌ల నుండి బ్యాకప్ బృందాలు కూడా పంపబడ్డాయి" అని SDRF ప్రకటన విడుదల చేసింది.


Tags:    

Similar News