Encounter : ఎదురుకాల్పుల్లో పదిహేను మంది మావోలు మృతి

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పదిహేను మంది మావోయిస్టులు మరణించారు;

Update: 2025-03-29 04:39 GMT
encounter,  maoists, died, chhattisgarh
  • whatsapp icon

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పదిహేను మంది మావోయిస్టులు మరణించారని తెలిసింది. ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ తో దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పదిహేను మంది మావోయిస్టులు మరణించారు.

కొండపై ఉన్నారని...
గోగుండా కొండపై మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన భద్రతాదళాలకు మావోయిస్టులు తారసడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకూ పదిహేను మంది మృతి చెందగా, వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News