Narendra Modi : నేడు నాగపూర్, ఛత్తీస్ ఘడ్ కు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉగాది పండగను నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరుపుకోనున్నారు.;

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉగాది పండగను నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరుపుకోనున్నారు. అక్కడ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక నాయకులకు నివాళులర్పిస్తారు. హెగ్డేవార్ స్మృతిమందిర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్, రెండో సంఘ్ చాలక్ ఎంస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళును అర్పించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించిది. దీంతో పాటు అంబేద్కర్ కు కూడా నివాళులర్పిస్తారు.
ఛత్తీస్ ఘడ్ కు వెళ్లి...
అనంతరం అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. నాగ్ పూర్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్ ఘడ్ పర్యటనకు వెళతారు. ఛత్తీస్ ఘడ్ లోని భిలాస్ పూర్ లో విద్యుత్తు, చమురు, గ్యాస్, రైలు, రోడ్డు, విద్య, గృహనిర్మాణ రంగాలకు చెందిన అనేక రకాలైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.