ఉత్తరకాశీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు

ఉత్తరకాశీలో కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. పలు ప్రాంతాల్లోని ఇళ్లు కంపించడం జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు

Update: 2022-02-12 05:04 GMT

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో.. ప్రజలకు భూ ప్రకంపనల ప్రభావం తెలియలేదు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో శనివారం ఉదయం 5.30 గంటలకు భూకంపం సంభవించింది. కాగా.. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగిన దాఖలాలు లేవు.

ఉత్తరకాశీలో కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. పలు ప్రాంతాల్లోని ఇళ్లు కంపించడం జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే భూకంప కేంద్రం ఎక్కడున్నది తెలియలేదు. కాగా.. వారంరోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో భూకంపం రావడం ఇది మూడోసారి. గత ఆదివారం ఉదయం 11.27 గంటలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. ఫిబ్రవరి 5న కూడా 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే 10వ తేదీన జమ్మూ కశ్మీర్ సహా ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరాఖండ్ లో 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.





Tags:    

Similar News