కశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. సైనిక కాన్వాయ్‌పై
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. పూంఛ్ జిల్లాలోని డేరా కి గలి సమీపంలో రెండు సైనిక వాహనాలపై గురువారం మధ్యాహ్నం సాయుధ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మరో మగ్గురు భద్రతా సిబ్బంది గాయపడిగా.. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. సురాన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డేరా కి గాలి, బుఫ్లియాజ్ మధ్య ధత్యార్ మోర్ వద్ద మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి చోటుచేసుకుంది.
బుధవారం రాత్రి నుండి డేరా కి గాలి ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్య చెప్పారు అధికారులు.జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని రక్షణ శాఖ అధికారప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ అన్నారు. ఇంతలో అదనపు సైనికులను తరలిస్తున్న ఓ ట్రక్కు, జిప్సీలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిందే తామేనంటూ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఆ ప్రాంతంలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఇంకా కాల్పుల కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆపరేషన్‌లో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనేది ఇంకా తెలియరాలేదు.