నేటి నుంచి 5 జీ సేవలు... ఈ నగరాల్లోనే

భారత్ లో నేటి నుంచి 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు 5జీ సేవలను ప్రారంభించనున్నారు

Update: 2022-10-01 03:43 GMT

భారత్ లో నేటి నుంచి 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు 5జీ సేవలను ప్రారంభించనున్నారు. తొలి విడతగా ప్రధాన నగరాల్లో ఈ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అనంతరం క్రమంగా అన్ని నగరాలకు విస్తరించనుంది. టెలికమ్యునికేషన్స్ విబాగం, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. కేవలం ఎంపిక చేసిన నగరాల్లోనే తొలుత ఈ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రధాని మోదీ చేతుల మీదుగా...
అలాగే ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్ ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన కనెక్టివిటీని అందించేలా 5జీ సేవలు నేటి నుంచి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, చండీఘడ్, ఢిల్లీ, గాంధీనగర్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కత్తా, లక్నో, ముంబయి, పూనే నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి.


Tags:    

Similar News