5జీ స్పెక్ట్రమ్ వేలం నేటి నుంచి ప్రారంభం
5జీ స్పెక్ట్రమ్ వేలం నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్ లో ఈ వేలం పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
5జీ స్పెక్ట్రమ్ వేలం నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్ లో ఈ వేలం పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 4 జీ సేవలు భారత్ లో అందుతున్నాయి. 5 జీ సేవలు అందించే వీలుగా నేటి నుంచి వేలం జరగనుంది. ఇందుకోసం అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి.
పది రెట్లు వేగంగా....
అందులో జియో, ఎయిర్‌టెల్ తో పాటు అదానీ గ్రూపు కూడా పాల్గొననుంది. ప్రస్తుతం ఉనన ఇంటర్నెట్ స్పీడ్ కంటే 5జీ సేవలు అందుబాటులోకి వస్తే పది రెట్లు వేగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు చేసిన సంస్థలు ఇరవై ఏళ్ల పాటు వినియోగించే అవకాశముంది.