నిమజ్జన వేడుకల్లో విషాదం.. నీటిలో మునిగి ఏడుగురు మృతి

అలాగే మహేంద్రగఢ్ లోని ఓ గ్రామంలో ఉన్న కాలువ వద్ద గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ 9 మంది కొట్టుకుపోయారు.

Update: 2022-09-10 05:18 GMT

నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాథుడిని నిమజ్జనం చేస్తుండగా అపశృతి జరిగింది. గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. సోనిపట్‌లో నిమజ్జనం చేస్తూ ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మహేంద్రగఢ్‌లో నలుగురు మృతి చెందారు. సోనిపట్ లోని మిమార్పూర్ ఘాట్ వద్ద వినాయకుడి నిమజ్జనానికి కుమారుడు, మేనల్లుడితో కలిసి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు.

అలాగే మహేంద్రగఢ్ లోని ఓ గ్రామంలో ఉన్న కాలువ వద్ద గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ 9 మంది కొట్టుకుపోయారు. వారి కోసం గాలించిన అధికారులు.. అర్థరాత్రి సమయంలో 8 మందిని వెలికి తీశారు. వారి నలుగురు మృతి చెందారు. నిమజ్జన వేడుకల్లో ఇలాంటి ఘటనలు జరగడంపై సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విచారం వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నీటిలో మునిగిపోయిన ఎంతోమందిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయని, బాధితులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.


Tags:    

Similar News