లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. ఎంత ఘోరం చోటు చేసుకుందంటే
మహారాష్ట్రలోని చంద్రపూర్ నగర శివార్లలో డీజిల్ ట్యాంకర్, కలపతో వెళ్తున్న ట్రక్కును ఢీకొంది
మహారాష్ట్రలోని చంద్రపూర్ నగర శివార్లలో డీజిల్ ట్యాంకర్, కలపతో వెళ్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది సజీవదహనమయ్యారని పోలీసు అధికారి తెలిపారు. చంద్రాపూర్-ముల్ రోడ్డులో గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
"చంద్రపూర్ నగరం సమీపంలోని అజయ్‌పూర్ సమీపంలో కలప దుంగలను రవాణా చేస్తున్న ట్రక్కును డీజిల్ లోడ్ చేసిన ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగాయి, దీంతో తొమ్మిది మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు" అని చంద్రపూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి సుధీర్ నందనవర్ తెలిపారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత అగ్నిమాపక దళం సిబ్బంది అజయ్‌పూర్‌కు చేరుకున్నారని, కొన్ని గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చామని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. బాధితుల మృతదేహాలను చంద్రపూర్ ఆసుపత్రికి తరలించినట్లు శ్రీ నందన్వార్ తెలిపారు.
ట్యాంకర్‌ను ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదకర రీతిలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలోనే తొమ్మిది మంది మరణించినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత అగ్నిమాపక దళం సిబ్బంది అజయ్‌పూర్‌కు చేరుకున్నారు బాధితుల మృతదేహాలను చంద్రపూర్ ఆసుపత్రికి తరలించినట్లు నందన్వార్ తెలిపారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రమాదంపై అధికారులు విచారణ జరుపుతున్నారని, ప్రమాదానికి గల కారణాలు త్వరలోనే తెలియనున్నాయి.