Kolkata : కోల్‌కత్తాలోని వైద్యురాలి హత్యాచార ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
కోల్‌కత్తాలోని వైద్యురాలి హత్యాచార ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది;
కోల్‌కత్తాలోని వైద్యురాలి హత్యాచార ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు ఈ కేసును విచారించనుంది.
దేశ వ్యాప్తంగా...
కోల్‌కత్తాలోని వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఇంకా మెడికోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనను సీబీఐకి అప్పగించడంతో ఇప్పటికే విచారణ ప్రారంభించింది. నిందితులను అదుపులోకి తీసుకుంది. నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ లు చేయడానికి కూడా హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు తీసుకోవడంతో ఎటువంటి ఆదేశాలు ఇస్తుందన్నది దేశమంతా ఉత్కంఠ నెలకొంది.