Delhi : ఢిల్లీలో స్కూళ్లలో బాంబు బెదిరింపు చేసింది ఎవరో తెలుసా?

ఢిల్లీలో ఇటీవల కాలంలో స్కూళ్లలో బాంబు బెదిరింపులు ఎక్కువగా వచ్చాయి.;

Update: 2025-01-10 06:05 GMT

ఢిల్లీలో ఇటీవల కాలంలో స్కూళ్లలో బాంబు బెదిరింపులు ఎక్కువగా వచ్చాయి. అయితే ఈ బాంబు బెదిరింపునకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు బెదిరింపునకు పాల్పడిన వ్యక్తి పన్నెండో తరగతి విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని పోలీసులు తేల్చారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో వరసగా స్కూళ్లకు వరస బెదిరింపులు రావడంతో పాఠశాలల్లో విద్యార్థులను పంపేసి బాంబు స్క్కాడ్ తనిఖీలు చేపట్టింది. ఎలాంటి బాంబులు లేవని గుర్తించారు.

పరీక్షలు ఎదుర్కొనేందుకు...
దాదాపు ఇరవై మూడు పాఠశాలలకు ఈరకమైన బాంబు బెదిరింపులు వచ్చాయి. విద్యార్థి తాను చదివే పాఠశాలతో పాటు మిగిలిన పాఠశాలలకు కూడా ఈ రకమైన బెదిరింపు మెయిల్స్ పంపేవాడు. ఎందుకంటే తన పేరు బయటపడకుండా ఉండేదుకే అలా చేశానని విచారణలో బాలుడు పేర్కొన్నాడు. పరీక్షలు రాయకుండా ఉండేందుకే ఈ మెయిల్స్ ను పంపినట్లు కూడా అంగీకరించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News