Bank Post : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్.బి.ఐ. తాజా నోటిఫికేషన్
నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది;
నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఆరు వందల పోస్టులకు ఎస్.బి.ఐ. నుంచి తాజా నోటిఫికేషన్ వెలువడింది. పీవో పో్స్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ ఈ నెల 16వతేదీగా నోటిపికేషన్ లో పేర్కొన్నారు.
ఈ నెల 16వ తేదీన...
కనీస విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు 750 రూపాయలుగా నిర్ణయించింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఈ ఏడాది మార్చి 8వ తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ జరగనుంది. మెయిన్స్ పరీక్షలు ఏ్పరిల్ మే నెలలో జరిగే అవకాశాలున్నాయి. మరిన్ని వివరాలకు sbi.co.in లో చూసుకోవచ్చు.