శాసనసభ స్థానాలను పెంచండి.. సుప్రీంలో పిటీషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయింది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. 119 స్థానాల నుంచి 153 స్థానాలకు పెంచాలని, ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల నుంచి 225 స్థానాలకకు పెంచాలంటూ పిటీషన్ దాఖలయింది. ఈ పిటీషన్ ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది.
విభజన చట్టం...
విభజన చట్టం నిబంధనలను అమలు చేసేలా పిటీషన్ దాఖలయింది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంాగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా పిటీషనర్ చేర్చారు. రాష్ట్ర విభజన చట్టంలో సీట్ల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ శాసనసభ స్థానాలను పెంచకుండా జాప్యం చేస్తుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని పిటీషనర్ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు.