బెడిసికొట్టిన ప్లాన్.. ఎయిర్ పోర్టులో కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి ఏకంగా 75 క్యాప్సూల్స్ ను మింగిన కిలాడీ లేడీని పట్టుకుని తమదైన స్టైల్లో విచారించగా..;
ఇథియోపియా నుంచి వచ్చిన మహిళ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి ఏకంగా 75 క్యాప్సూల్స్ ను మింగిన కిలాడీ లేడీని పట్టుకుని తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం అంగీకరించింది. కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ ఈ కొకైన్ స్మగ్లింగ్ ను పట్టించడం విశేషం. ఆదివారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా.. ఓ మహిళ ప్రవర్తన అనుమానంగా కనిపించింది. దాంతో బెంగళూరు డీఆర్ఐ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇథియోపియా లేడీ కిలాడీని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు.
ఎంత విచారించినా నోరు విప్పకపోవడంతో.. తమ స్టైల్లో విచారణ జరిపారు. దాంతో పొట్టలో క్యాప్సూల్స్ రూపంలో కొకైన్ ను దాచినట్లు వెల్లడించింది. ఆమెకు శస్త్రచికిత్స చేయించి కొకైన్ ను బయటకు తీయించారు. మొత్తం రూ.11కోట్ల విలువ చేసే 734 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కిలాడీ లేడీపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సదరు మహిళ ఇంకా ఎక్కడైనా కొకైన్ ను దాచిందా ? అన్నవిషయాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.