కొండ చరియల్లో యువకుడు.. రెండురోజులుగా...?

కొండ చరియల్లో ఇరుక్కుని ఒక యువకుడు రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు;

Update: 2022-02-09 04:02 GMT

కొండ చరియల్లో ఇరుక్కుని ఒక యువకుడు రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. కేరళలోని పాలక్కాడ్ సమీపంలోని మలప్పజ ప్రాంతంలోని కొండచరియల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువకుడిని కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైన్యం సాయాన్ని కోరారు. ఈరోజు బెంగళూరు నుంచి సైన్యం వచ్చే అవకాశముంది.

రెండు రోజుల నుంచి....
బాబు అనే యువకుడు మలప్పజ ప్రాంతంలోని కొండ చరియల్లో రెండు రోజుల క్రితం ఇరుక్కున్నాడు. నేటికి మూడో రోజు. ఆహార పానీయాలు లేకుండానే బాబు అవస్థలు పడుతున్నారు. తీరప్రాంత రక్షక దళం హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రయత్నాలు చేసింది. పారా కమాండోలో వస్తేనే బాబును రక్షించే అవకాశాలున్నాయని తెలిుస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్ దళం ఎంత ప్రయత్నించినా బాబు ను బయటకు తీసుకు రావడం సాధ్యం కాలేదు. కొండ శిఖరం ఎక్కేందుకు ప్రయత్నించిన బాబు కొండ చరియల్లో ఇరుక్కుపోయాడు.


Tags:    

Similar News