మరోసారి ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పెంపు

ఈ మేరకు సంస్థ సీఈఓ ప్రకటన విడుదల చేశారు. ఆధార్ ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఈ ఏడాది మార్చి 15 నుంచి..

Update: 2023-06-18 09:19 GMT

UIDAI, Aadhaar free update

ఆధార్ కార్డుపొంది 10 సంవత్సరాలు దాటిన వారు అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) గడువు పొడిగించింది. ఈ మేరకు సంస్థ సీఈఓ ప్రకటన విడుదల చేశారు. ఆధార్ ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఈ ఏడాది మార్చి 15 నుంచి తొలి అవకాశం కల్పించింది. ఈ గడువు జూన్ 14తో ముగిసింది. దాంతో ఆధార్ ను ఇంకా అప్డేట్ చేసుకోని వారు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ రెండోసారి ఆధార్ అప్డేట్ గడువు ను పెంచింది.

సెప్టెంబరు 14 వరకు గడువును పొడిగిస్తూ.. యూఐడీఏఐ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ గడువు లోగా ఆధార్ కార్డును నవీకరణ చేసుకోవాలని, ఈ గడువు ముగిసిన తర్వాత నిర్థారిత రుసుము చెల్లించి నవీకరించుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ ఉత్తర్వులలో పేర్కొంది. యూఐడీఏఐ నిబంధనల మేరకు ‘మై ఆధార్’ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లలో కూడా నవీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, పుట్టిన తేదీ, చిరునామాతో పాటు తాజాగా దిగిన ఫొటోను కూడా అప్‌లోడ్‌ చేసుకునే వీలుంది.



Tags:    

Similar News