ఢిల్లీ టు పంజాబ్... సామాన్యుల అండతోనే?

ఢిల్లీ నుంచి పంజాబ్ కు వెళ్లామని, దేశమంతా పార్టీని ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు.

Update: 2022-03-10 12:21 GMT

ఢిల్లీ నుంచి పంజాబ్ కు వెళ్లామని, దేశమంతా పార్టీని ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అన్నారు. నూతన భారతాన్ని నిర్మించుకునేందుకు అందరం నడుంబిగించాలన్నారు. పేదలకు చదువు దూరం కాకూడదన్నారు. పేదలు కూడా ఇంజినీరింగ్, మెడికల్ విద్యను అభ్యసించేలా భారత్ ఎదగాలన్నారు. సామాన్యుల పార్టీకి ప్రజల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

హేమాహేమీలు ఓడింది.....
పంజాబ్ లో సామాన్యుల చేతిలో మాజీ ముఖ్యమంత్రులు ఓటమి పాలయిన విషయాన్ని గుర్తు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ని ఓడించింది సెల్ ఫోన్ రిపేర్ చేసుకునే ఒక సామాన్యుడని ఆయన చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ తమ పార్టీకి చెందిన సామాన్య మహిళ కార్యకర్త చేతిలో ఓటమి పాలయ్యారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తమ పార్టీకి సామాన్యులే అండగా ఉంటారని మరోసారి స్పష్టమయిందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది.


Tags:    

Similar News