Narendra Modi : ఈ నెల 21న కువైట్ కు నరేంద్ర మోదీ
ఈ నెల 21వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ బయలుదేరి వెళ్లనున్నారు.
ఈ నెల 21వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ బయలుదేరి వెళ్లనున్నారు. కువైట్ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజులు పర్యటించనున్నారు. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్, ప్రధాని అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సబాహ్ తదితరులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
తొలిసారి పర్యటన...
ప్రధాని మోదీ తన కువైట్ పర్యటనలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 22న కువైట్ ఉన్నత అధికారులతో ఆయన అధికారికంగా చర్చించనున్నారు. కువైట్‌లో దాదాపు పది లక్షలమంది భారతీయులు నివసిస్తున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ పర్యటించని ఏకైక జీసీసీ సభ్య దేశం కువైట్ కావడంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now