Leopard : తమిళనాడులో విషాదం..చిరుత పులి దాడిలో యువతి మృతి
తమిళనాడులో విషాదం జరిగింది. చిరుతపులి దాడిలో ఒక యువతి మరణించింది
తమిళనాడులో విషాదం జరిగింది. చిరుతపులి దాడిలో ఒక యువతి మరణించింది. తమిళనాడు రాష్ట్రంలోని కుప్పం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన యువతి అంజలిపై చిరుతపులి దాడి చేసింది. ఆమె కట్టెలు తీసుకు వస్తుండగా ఒక్కసారి చిరుతపులి దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.
అడవిలోకి వెళ్లడంతో...
సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో అంజలి కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెతుకులాట ప్రారంభించగా అంజలి మృతదేహం లభించింది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పులిని బంధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బోన్లను ేర్పాటు చేశారు. గ్రామస్థులు ఎవరూ అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లొద్దని అలెర్ట్ చేశారు. అలాగే పెంపుడు జంతువులను కూడా దూరంగా ఉంచాలని, చిరుతపులి దొరికేంత వరకూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now