SBI : నిరుద్యోగులకు ఎస్.బి.ఐ బంపర్ ఆఫర్.. ఒకేసారి ఇన్ని పోస్టులా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో క్లర్క్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో క్లర్క్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 13735 క్లర్క్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 17-12-2024 న ప్రారంభం కాగా, వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ముగియనుంది.
పరీక్షలు ఫిబ్రవరిలో...
ఈ పోస్టుల కోసం ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో, మెయిన్ పరీక్ష మార్చి లేదా ఏప్రిల్‌లో జరగనున్నాయి. జనరల్/ OBC/ EWS కేటగిరీ అభ్యర్థులు 750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. నిజానికి నిరుద్యోగులకు ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయడం వరమేనని చెప్పాలి. ప్రయత్నించి చూస్తే ఎస్.బి.ఐ ఉద్యోగిగా మారే అవకాశాలున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now