ఆప్‌కు ఎదురుదెబ్బ.. కీలక నేత అరెస్ట్
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంజయ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచే ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఉదయం నుంచే ప్రచారం జరిగింది. జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ ఈడీ అధికారులు ఎంపీ సంజయ్ సింగ్ ను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ....
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరాతో సంజయ్ సింగ్‌కు పరిచయాలున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆయన ఇంట్లో సోదాలను నిర్వహించిన అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. ఆయన స్టేట్‌మెంట్ ను రికార్డు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన కీలక నేతల్లో సంజయ్ సింగ్ ఒకరు. ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.