ఇక సూర్యుడే టార్గెట్.. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన 'ఇస్రో'
మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది ఇస్రో.ఇప్పటికే చంద్రయాన్ 3ని ప్రయోగించి విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ చేసింది ఇస్రో. చంద్రయాన్-3ని దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయడం ప్రపంచంలో మొదటి దేశంగా అవతరించింది.
మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది ఇస్రో.ఇప్పటికే చంద్రయాన్ 3ని ప్రయోగించి విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ చేసింది ఇస్రో. చంద్రయాన్-3ని దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయడం ప్రపంచంలో మొదటి దేశంగా అవతరించింది. అలాగే చంద్రునిపై రోవర్‌ను పంపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు చంద్రయాన్ 3 తన పని తాను చేసుకుంటూ కీలక పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే చాలా విషయాలను పరిశోధించి కీలక సమాచారాన్ని ఇస్రోకు పంపింది. ఇక తాజాగా ఇస్రో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పుడు ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి ప్రయోగం చేపడుతోంది. శ్రీహరికోట వేదికగా సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ప్రయోగం చేపట్టనుంది. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి రహస్యాల గుట్టువిప్పడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు.. కరోనియంలో ఉన్న పదార్థాలు.. సౌర తుఫానులను అధ్యయనం చేయడానికి.. భారత్ చేస్తున్న తొలిసారిగా ప్రయోగం చేపట్టనుంది. అయితే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ల దూరం:
సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C57) ద్వారా భారత కాలమానం ప్రకారం ఉదయం 11:50 గంటలకు ఆదిత్య-ఎల్1ని ప్రయోగించనున్నట్లు తెలిపింది. సూర్యుడికి ఆదిత్య అనే పేరు కూడా ఉంది. L1 అంటే – Lagrange point 1. 1 పాయింట్ దూరం భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ (15 లక్షలు) కిలోమీటర్లు. L1 పాయింట్ కరోనల్ కక్ష్యలో ఆదిత్య-L1 ఉంచడం ద్వారా సూర్యుని అధ్యయనం చేయబడుతుంది.
మరోవైపు చంద్రయాన్ -3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల పరిశోధనా కాలంలో..ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చంద్రుని దక్షిణ ధృవంలో.. ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికితోబాటు..ఉష్ణోగ్రతల్లో మార్పులను చంద్రయాన్-3 ఇప్పటికే గుర్తించింది.