Congress : ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలో ఏఐసీసీ కొత్త భవనాన్ని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రారంభించారు.;
ఢిల్లీలో ఏఐసీసీ కొత్త భవనాన్ని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రారంభించారు. నూతన భవనాన్ని దాదాపు పదిహేనేళ్ల నుంచి నిర్మిస్తున్నారు. నేడు కొత్త కార్యాలయాన్ని సోనియాగాంధీ ప్రారంభించారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీలు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
నూతనంగా నిర్మించిన...
పార్టీ కార్యాయలంలో మల్లికార్జున ఖర్గే జెండా ఎగురువేశారు. 9ఎ కోట్లా మార్గంలో నిర్మించిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అత్యాధునిక హంగులతో ఏఐసీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అనేక మంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు.