Sabarimala : శబరిమలలో పెరిగిన భక్తులు.. దర్శనానికి సమయం?
అయ్యప్ప దర్శనానికి శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.;
అయ్యప్ప దర్శనానికి శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈనెల 14వ తేదీన మకర జ్యోతి దర్శనం కావడంతో ఎక్కువ మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు. అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. పంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్లు కొనసాగుతుంది.
అయ్యప్ప దర్శనానికి...
రద్దీ కారణంగా నాలుగు వేల మందికి మాత్రమే స్పాట్ దర్శన టోకెన్లు మంజూరు చేశార. రేపటి నుంచి ఆన్‌లైన్ దర్శనాలు మరింత కుదించనున్నారు. రేపు 50 వేల మందికి, 14న 40 వేల మందికి దర్శనం కల్పించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. ఈనెల 15వ తేదీన 60 వేల మందికి ఆన్‌లైన్ దర్శన సదుపాయం కల్పించేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం ఏర్పాట్లు పూర్తిచేసింది.