తమిళనాడులో జల్లికట్టు పోటీలు.. గాయపడుతున్న యువకులు

సంక్రాంతి వేళ తమిళనాడులో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. అనేక మంది ఈ సందర్భంగా గాయాలపాలవుతున్నారు;

Update: 2025-01-15 04:27 GMT

సంక్రాంతి వేళ తమిళనాడులో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. అనేక మంది ఈ సందర్భంగా గాయాలపాలవుతున్నారు. తమిళనాడులో జల్లికట్టులో ఎద్దుకొమ్ము తగిలి ఒక యువకుడు కూడా మరణించాడు. అయినా పోటీలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. చెన్నైలోని పాలమేడు సమీపంలో జల్లికట్టు పోటీలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ప్రత్యేక వైద్య శిబిరాలు...
జల్లి కట్టు పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది యువకులు తరలి వచ్చారు. ఎద్దులను ఆపేందుకు పడే ఈ పోటీలో అనేక మంది గాయాలావుతున్నారు. వెంటనే వారికి ప్రాధమిక చికిత్స అందించేందుకు ప్రత్కేకంగా వైద్య శిబిరాలతో పాటు అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. జల్లికట్టు పోటీల్లో గెలిచిన వారికి కార్లు, ఖరీదైన మోటారు బైక్ లు వంటివి బహుమతులుగా ఇస్తున్నారు.


Tags:    

Similar News