సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.;

Update: 2024-09-06 01:30 GMT

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలిపారు. సీతారాం ఏచూరి పరిస్థతి అత్యంత విషమంగా ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవల న్యుమోనియోతో ఆయన బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

ఎయిమ్స్ లో చేరి..
గత నెల 19వ తేదీన ఎయిమ్స్ లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు ఐసీయూ తరలించి చికిత్స అందిస్తున్నారు. సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉందని, అందుకే ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. సీతారాం ఏచూరి ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.


Tags:    

Similar News