నేడు టాటా చేతికి ఎయిర్ ఇండియా..70 ఏళ్ల తర్వాత?
ఎయిర్ ఇండియా నేడు టాటా చేతుల్లోకి వెళ్లనుంది. 70 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వస్తుంది
ఎయిర్ ఇండియా నేడు టాటా చేతుల్లోకి వెళ్లనుంది. 70 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వస్తుంది. ఈరోజు దీనికి సంబంధించిన అధికారిక బదలాయింపు పూర్తి కానుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్ ఇండియా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎయిర్ ఇండియాను ప్రయివేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పూర్తి వాటాను....
దీనికి సంబంధించిన జరిగిన బిడ్లలో ఎయిర్ ఇండియాను టాటా సంస్థ దక్కించుకుంది. 18,000 కోట్లు వెచ్చించి ఎయిర్ ఇండియాను సొంతం చేుకుంది. గత ఏడాది ఈ బిడ్డింగ్ లో వందశాతం వాటాను టాటా సంస్థ దక్కించుకున్నప్పటికీ అధికారిక బదలాయింపు పూర్తి కాలేదు. దీంతో ప్రధాన విమానాశ్రయాల్లోని కార్గో సేవలను కూడా టాటా సంస్థ దక్కించుకుంది. ఈరోజు పూర్తిగా ఎయిర్ ఇండియా టాటా సంస్థ అధీనంలోకి రానుంది.