నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
అమర్‌నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం అయింది. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు
అమర్‌నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం అయింది. అమర్‌నాధ్ ఆలయ యాత్ర నేటి నుంచి ప్రారంభమై ఆగస్టు 19 వరకూ సాగనుంది. ఆషాఢ మాసం పౌర్ణమి రోజు నుంచి అమర్‌నాధ్ యాత్ర ప్రారంభమవుతుంది శ్రావణ పౌర్ణమి రోజు వరకు కొనసాగుతుంది. అయితే ఈ యాత్రకోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులకు మాత్రమే అనుమతిస్తారు.
అత్యంత ఎత్తులో ఉండే...
జమ్మూకాశ్మీర్ లోని గందర్‌బల్ జిల్లాలో అమర్‌నాథ్ పర్వతంపై ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఈ సీజన్ లో లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేశారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉండే ఈ యాత్ర సాగించడం కొంత క్లిష్టమైనది కావడంతో ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు లేని వారిని మాత్రమే అనుమతిస్తారు. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.