కేరళను వణికిస్తున్న 'టమోటో ఫీవర్'.. లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలివి !

భారతదేశంలో ఇది చాలా సాధారణ జ్వరాలలో ఇది ఒకటి. ఇందులో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు..

Update: 2022-05-09 03:40 GMT

ఓ వైపు కరోనా మహమ్మారి టెన్షన్ అందరినీ వణికిస్తూ ఉండగా.. ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని టమోటో ఫీవర్(టమోటో ఫ్లూ) వణికిస్తోంది. కేరళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కరోనా మహమ్మారి ప్రబలుతూ ఉండగా.. ఇప్పుడు ఈ కొత్త రోగం జనాలని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంది. కేరళలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడంతో పాటూ.. ఇప్పుడు రాష్ట్రాన్ని మరో ఫ్లూ వెంటాడడం ప్రారంభించింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 80 మంది పిల్లలు 'టమోటో ఫ్లూ' అని పిలిచే అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. స్థానిక మీడియా కొల్లంలో 82 కేసులు బయటపడ్డాయని చెబుతూ ఉంది. స్థానిక వార్తా వెబ్‌సైట్‌ల ప్రకారం ఈ కేసులన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో రికార్డు అయినవే..ఇక ప్రైవేట్ ఆసుపత్రుల నుండి వచ్చిన కేసులను కలుపుకుంటే సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు.

టొమాటో ఫ్లూ అంటే ఏమిటి?

భారతదేశంలో ఇది చాలా సాధారణ జ్వరాలలో ఒకటి. ఇందులో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఓ రకమైన జ్వరాన్ని అనుభవిస్తారు. సాధారణంగా ఈ ఫ్లూ సోకిన పిల్లలలో దద్దుర్లు, చర్మం మీద మంట మాత్రమే కాకుండా డీహైడ్రేషన్ కు గురవుతారు. దీని వల్ల శరీరంలోని అనేక భాగాలపై బొబ్బలు ఏర్పడతాయి. ఈ బొబ్బలు ఎరుపు రంగులో ఉండడంతో దీనిని "టమోటో ఫ్లూ" లేదా "టమోటా జ్వరం" అంటారు. భారతదేశంలోని కొల్లాంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ రకమైన ఫ్లూని పిల్లలు ఎదుర్కొంటూ ఉన్నారు. తగిన నివారణ చర్యలు తీసుకోకపోతే ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు.

'టమోటో జ్వరం' లక్షణాలు:

- చేతులు, కాళ్ళలో రంగు మారుతుంది

- అలసట

- కీళ్ళ నొప్పి

- వికారం, వాంతులు, అతిసారం

- దగ్గు, తుమ్ము, గురక, ముక్కు కారడం

- తీవ్ర జ్వరం

- ఒళ్ళు నొప్పులు

    టొమాటో ఫ్లూ నివారణ చర్యలు:
    వైరస్ ప్రాణాంతకం కాదని, చికిత్స చేయవచ్చని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్‌ను నిరోధించడానికి ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి:
    - బొబ్బలను తాకవద్దు.. గోక్కోవడం అసలు చేయవద్దు
    - కాచిన నీటిని తాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండండి.
    - సరైన పరిశుభ్రత పాటించండి.
    - వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాన్ని నివారించండి.
    - స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి
    - వ్యాధి యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని నివారించడానికి వీలైనంతగా విశ్రాంతి తీసుకోండి



    Tags:    

    Similar News