Ambani Return Gifts: గిఫ్ట్ గా ఒకటిన్నర కోటి రూపాయల విలువైన వాచీలా!!

విఐపి అతిథులందరికీ అనంత్ అంబానీ ఖరీదైన వాచీలను బహుమతిగా ఇచ్చారని

Update: 2024-07-14 07:21 GMT

విఐపి అతిథులందరికీ అనంత్ అంబానీ ఖరీదైన వాచీలను బహుమతిగా ఇచ్చారని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వాచీలు ఒక్కొక్కటి రూ. 1.5 కోట్లకు పైగానే అని తెలుస్తోంది. వాటిని అంబానీలు అతిథుల కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల గ్రాండ్ వెడ్డింగ్‌లో అంబానీ VIP అతిథులందరికీ బహుమతిగా Audemars Piguet వాచీలను ఇచ్చారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వాచీలకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక వైరల్ వీడియోలో షారూఖ్ ఖాన్, మీజాన్, ఇతర పెళ్లికొడుకు ఫ్రెండ్స్ ఈ గడియారాలను ప్రదర్శించారు.

అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చిన వాచ్‌లో 41 mm 18K పింక్ గోల్డ్ కేస్, 9.5 mm మందం ఉంటుంది. గ్రాండే టాపిస్సేరీ నమూనా, బ్లూ కౌంటర్లు, పింక్ గోల్డ్ అవర్ మార్కర్‌లు, రాయల్ ఓక్ హ్యాండ్స్‌తో ప్రకాశించే పూతతో పింక్ గోల్డ్ టోన్ డయల్‌ ఉంటాయి. ఈ వాచ్‌లను రణ్‌వీర్ సింగ్, శిఖర్ పహారియా, వీర్ పహారియా అందుకున్నారని తెలుస్తోంది. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు.


Tags:    

Similar News